News November 26, 2024
పెద్దపల్లి: దారుణం.. విద్యార్థినితో నగ్న పూజకు యత్నం!

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఓ బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి బాలికతో నగ్న పూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది. హాస్టల్లో పని చేసే వంట మనిషి నగ్న పూజ చేస్తే కనకవర్షం కురుస్తుందని ఓ బాలికతో చెప్పింది. దీంతో భయాందోళనకు గురైన ఆ బాలిక వెంటనే తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వారు పోలీసులను ఆశ్రయించగా సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Similar News
News October 16, 2025
మంత్రి పొన్నం ప్రభాకర్‌పై దుష్ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చనిపోయారని సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్కు చెందిన గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
News October 16, 2025
KNR: 30లక్షల క్వింటాళ్ల వరిధాన్యం సేకరణే లక్ష్యం

ఖరీఫ్ 2025-26 సీజన్లో జిల్లా వ్యాప్తంగా 325 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ నర్సింగరావు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ఏజెన్సీల ద్వారా ఈసారి సుమారు 30 లక్షల క్వింటాళ్ల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశముందని అంచనా వేశామని ఆయన పేర్కొన్నారు. అందుకు తగ్గట్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు నర్సింగరావు చెప్పారు.
News October 16, 2025
KNR: సానుభూతితో కాదు.. పట్టుదల, ప్రతిభతో విజయం సాధించాలి

కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాలికలు సానుభూతితో కాకుండా పట్టుదల, నైపుణ్యంతో విజయం సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమం బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. కష్టపడి చదివితేనే విజయం సాధించవచ్చన్నారు. బాలికలు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించి ధైర్యంగా ముందడుగు వేయాలని కలెక్టర్ కోరారు.