News November 26, 2024

పెద్దపల్లి: దారుణం.. విద్యార్థినితో నగ్న పూజకు యత్నం!

image

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఓ బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి బాలికతో నగ్న పూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది. హాస్టల్‌లో పని చేసే వంట మనిషి నగ్న పూజ చేస్తే కనకవర్షం కురుస్తుందని ఓ బాలికతో చెప్పింది. దీంతో భయాందోళనకు గురైన ఆ బాలిక వెంటనే తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వారు పోలీసులను ఆశ్రయించగా సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Similar News

News December 8, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.1,93,193 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.91,082 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.81,280, అన్నదానం రూ.20,831, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ద్వారా ప్రజలకు తెలిపారు.

News December 7, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఇబ్రహీంపట్నం మండలంలో వ్యవసాయ బావిలో దూకి మహిళా ఆత్మహత్య. @ వేములవాడలో యారన్ డిపో ప్రారంభం. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాపాలన విజయోత్సవాలు. @ వెల్గటూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ. @ 6 గ్యారెంటీలను అమలు చేసి తీరు తామన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

News December 7, 2024

కాళేశ్వరం: మే 15 నుంచి సరస్వతీ పుష్కరాలు

image

వచ్చే సంవత్సరం మే నెలలో కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతీ పుష్కరాల నిర్వహణకు అధికారులు అంచనాలు, నివేదికలు అందజేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సరస్వతీ పుష్కరాల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.