News January 23, 2025
పెద్దపల్లి: దివ్యాంగులకు స్వయం ఉపాధి అవకాశాలు

దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాకు రూ.50 వేల విలువైన 17 యూనిట్లను మంజూరు చేసిందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 02 వరకు ఆసక్తి ఉన్న దివ్యాంగులు www.tsobmms.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 24, 2025
ఆఖరి మజిలీలో అడవి పార్టీ!

అట్టడుగు వారికి చట్టం చేయని న్యాయం తుపాకీ గొట్టం చేస్తుందని నమ్మిన అడవి పార్టీ ఆఖరి మజిలీలో ఉంది. అర్ధ శతాబ్దం క్రితం సమాజంలో వారి అవసరం, ఆ స్థాయిలో మద్దతూ ఉండేవి. కాలంతో పాటు పరిస్థితులు, ప్రజల జీవనం మారాయి. కానీ నక్సలైట్లుగా మొదలై మావోయిస్టులుగా రూపాంతరం చెందినా తమ పోరాట పంథా మార్చుకోలేదు. ఫలితం.. ప్రజలకు పరిష్కారం అవుతామన్న ‘అన్న’ తమ ఊపిరి ఉండాలంటే ‘గన్ను’ వీడటమే పరిష్కారమనేలా చేసింది.
News November 24, 2025
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ వినూత్న కార్యక్రమం

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేపట్టిన ‘చదవండి.. అర్థం చేసుకొండి.. ఎదగండి’ కార్యక్రమం జిల్లాలో ఉద్యమంలా సాగుతోంది. 958 పాఠశాలల్లోని 28,982 మంది విద్యార్థులకు దీనిని అమలు చేస్తున్నారు. కలెక్టర్ చొరవతో 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యార్థుల అభ్యసన స్థాయి మెరుగైందని విద్యా యంత్రాంగం గుర్తించింది.
News November 24, 2025
ఐటీ హబ్ ఫేజ్ 2 విస్తరణ శరవేగం.. నెరవేరనున్న యువత కలలు

ఖమ్మం జిల్లాలో ఐటీ హబ్ ఫేజ్ 2 విస్తరణకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రణాళికలు సిద్ధం చేశారు. కొత్త ఐటీ కంపెనీలకు సౌకర్యాలు, రాయితీలను ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం 2 వేల మంది ఉద్యోగులు ఉండగా, రాబోయే ఐదేళ్లలో 10 వేలకు పైగా ఐటీ ఉద్యోగాలు స్థానిక యువతకు దక్కనున్నాయని అధికారులు తెలిపారు.


