News March 13, 2025
పెద్దపల్లి: దివ్యాంగులకు విజ్ఞప్తి అప్లై UDID కార్డు

ప్రతీ దివ్యాంగునికి యూనిక్ డిసెబిలిటీ ఐడి నంబర్ జారీ గురించి PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. సదరం క్యాంపులు సజావుగా జరుగడానికి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. UDID కార్డులు ఇతర రాష్ట్రాల్లో కూడా పనిచేస్తాయన్నారు. అధికారులు దివ్యాంగులకు అవగాహన కల్పించి మీసేవాలో బుక్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తులు పరిశీలించి పోస్టులో కార్డులు పంపాలని ఆదేశించారు.
Similar News
News March 15, 2025
గిర్నిబావి వద్ద కాల్పులు జరగలేదు: వరంగల్ సీపీ

కొమ్మాల జాతర సందర్భంగా గిర్నిబావిలో ప్రభ బండ్లు వరుస క్రమంలో తరలి వెళ్లే క్రమంలో కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా సదరు వ్యక్తులు ముందుకు వెళ్లారన్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రభ బండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగిందని, ఎలాంటి పోలీస్ కాల్పులు జరగలేదని వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు.
News March 15, 2025
హిందీని నేనెప్పుడూ వ్యతిరేకించలేదు: పవన్

AP: తాను హిందీ భాషను ఎప్పుడూ వ్యతిరేకించలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దాన్ని నిర్బంధంగా అమలు చేయడాన్నే వ్యతిరేకించానని ట్వీట్ చేశారు. NEP-2020 హిందీని కంపల్సరీ చేయాలని చెప్పలేదని, కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆ పాలసీ ప్రకారం మాతృభాష, మరో భారతీయ భాష, ఒక అంతర్జాతీయ భాష నేర్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. హిందీని చదవడం ఇష్టం లేకపోతే మిగతా భాషలు నేర్చుకోవచ్చన్నారు.
News March 15, 2025
ఎన్నికల కోసమే డీఎంకే హిందీ డ్రామా: కిషన్ రెడ్డి

TG: తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతోందని, అందుకే డీఎంకే పార్టీ ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. త్రిభాషా పాలసీ కొత్తదేం కాదని, దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదని స్పష్టం చేశారు. తమిళ భాష అభివృద్ధికి స్టాలిన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌పైనా డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.