News February 10, 2025

పెద్దపల్లి: నేటి నుంచి తాత్కాలికంగా భాగ్యనగర్ రైలు రద్దు

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ట్రాక్ మరమ్మతుల కారణంగా నేటి నుంచి 21 వరకు భాగ్యనగర్‌‌‌‌‌తో సహా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నాయి. ప్రతి రోజూ జమ్మికుంట రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Similar News

News November 23, 2025

నల్గొండ: పున్నా కైలాస్ నేత రాజకీయ నేపథ్యం

image

మునుగోడుకు చెందిన పున్నా కైలాస్ నేత ఓయూలో చదువుకునే సమయంలోనే రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఓయూ విద్యార్థి నేతగా.. విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్‌లో చేరి 2018, 2023లో మునుగోడు MLA టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. 2022 నుంచి TPCC ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

News November 23, 2025

భద్రాద్రి జిల్లాలో శనివారం ముఖ్యాంశాలు

image

✓భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా తోట దేవి ప్రసన్న
✓దమ్మపేట: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3 లారీలు సీజ్
✓కొత్తగూడెం 2టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ
✓కొత్తగూడెం: ఎన్కౌంటర్ బూటకమే: CPIML మధు
✓అనుమానిత వాహనాలు తనిఖీ చేసిన ఇల్లందు పోలీసులు
✓భద్రాచలం: ఇసుక లారీలతో ప్రజల ఇబ్బందులు
✓కొత్తగూడెం: 4 లేబర్ కోడ్ రద్దు చేయాలి: TUCI
✓సింగరేణిలో 1258 మంది ఉద్యోగులు పర్మినెంట్

News November 23, 2025

కుజ దోషం తొలగిపోవాలంటే?

image

కుజ దోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ‘ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహీ.. తన్నో అంగారక ప్రచోదయాత్’ అనే గాయత్రి మంత్రాన్ని పఠించాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించాలని చెబుతున్నారు. సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో మంగళవారం రోజున దాన ధర్మాలు చేయడం, హనుమంతుడిని పూజించడం ఎంతో మంచిదని అంటున్నారు.