News February 10, 2025

పెద్దపల్లి: నేటి నుంచి తాత్కాలికంగా భాగ్యనగర్ రైలు రద్దు

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ట్రాక్ మరమ్మతుల కారణంగా నేటి నుంచి 21 వరకు భాగ్యనగర్‌‌‌‌‌తో సహా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నాయి. ప్రతి రోజూ జమ్మికుంట రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Similar News

News March 17, 2026

ఫోన్ పోయిందా అయితే ఇలా చేయండి: VZM ఎస్పీ

image

మొబైల్ ఫోన్ పోయినా, దొంగతనం జరిగినా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి లేదా ఆన్‌లైన్‌లో CEIR పోర్టల్ ద్వారా నమోదు చేయవచ్చని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం తెలిపారు. సమీప పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసి మొబైల్ ట్రాకింగ్ చర్యలు చేపట్టవచ్చని చెప్పారు. ప్రజలు తమ మొబైల్ IMEI నంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల వద్ద నుంచి సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేయవద్దని సూచించారు.

News March 17, 2026

NGKL: పర్యావరణ పరిరక్షణ.. 4 గ్రామాల తరలింపు

image

పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్రాబాద్(M) వటువర్లపల్లితో పాటు మరో 4 గ్రామాలను మైదాన ప్రాంతానికి తరలించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లోని పన్న వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ తరలింపు కొనసాగుతోంది. కొత్త గ్రామాల ఏర్పాటుకు, మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, MLA వంశీకృష్ణ, మాజీ డీఎఫ్‌ఓ రోహిత్ గోపిడికి రీలొకేషన్ కమిటీ అధ్యక్షుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News March 17, 2026

భీమవరం: ‘ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’

image

రాబోయే వేసవిలో ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలి కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో భీమవరం కలెక్టరేట్లో సమీక్ష సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి ప్రదేశాలను గుర్తించి అక్కడ తాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు.