News February 11, 2025
పెద్దపల్లి: నేటి నుంచి భాగ్యనర్ ఎక్స్ప్రెస్

పెద్దపల్లి జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులు రద్దు కావాల్సిన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలును ఈనెల 11 నుంచి 14 వరకు పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి కాజీపేట మీదుగా కాగజ్నగర్(ఈనెల11 నుంచి 14)కు వెళ్తుందని, మళ్లీ 12న కాగజ్నగర్ నుంచి SEC(ఈనెల 12-15)వరకు నడపనున్నట్లు అధికారులు ఉత్తర్వులో పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ జానకి షర్మిల

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం డిసెంబర్ 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా పబ్లిక్ మీటింగ్లు, ర్యాలీలు, ధర్నాలు నిషేధమని స్పష్టం చేశారు. అలాగే ఆయుధాలు, పేలుడు పదార్థాలు, లౌడ్ స్పీకర్లు, డీజేలు వినియోగించడం కూడా నిషేధమని చెప్పారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News December 5, 2025
పుతిన్ సంపద ఎంత.. బిల్ గేట్స్ కన్నా ధనవంతుడా?

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన నేతల్లో పుతిన్ ఒకరు. ఆయనకు ఏడాదికి రూ.1.25 కోట్ల జీతం వస్తుందని, 800 చ.అ. అపార్ట్మెంట్, ప్లాట్, 3 కార్లు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి. కానీ పుతిన్ సంపద $200 బిలియన్లకు పైనే అని ఫైనాన్షియర్ బిల్ బ్రౌడర్ గతంలో చెప్పారు. ఇది బిల్ గేట్స్ సంపద ($113B-$128B) కన్నా ఎంతో ఎక్కువ. ఆయనకు విలాసవంతమైన ప్యాలెస్, షిప్, ఎన్నో ఇళ్లు, విమానాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.
News December 5, 2025
MNCL: ఉపసంహరణ డెడ్ లైన్ రేపే.. అభ్యర్థులపై ఒత్తిడి..?

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లె రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రెండో విడత సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. దీంతో వివిధ పార్టీల ముఖ్య నాయకులు రంగంలోకి దిగి నామినేషన్లు వేసిన అభ్యర్థులను ఉపసంహరణకు ఒప్పించేందుకు బుజ్జగింపులు, బేరసారాలు చేస్తున్నారు. ఈ పరిణామాలతో పల్లె రాజకీయాలు రసవత్తరంగా మారాయి.


