News March 12, 2025
పెద్దపల్లి: నేడు జాబ్‌మేళా

పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు పేటీఎం సర్వీస్‌లో ఉద్యోగాలు కల్పించడానికి నేడు కలెక్టరేట్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతి రావు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు రూం నం.225లో బుధవారం ఉదయం 11గంటలకు సంబంధిత పత్రాలు జిరాక్సులతో హాజరవ్వాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7013188805, 8121262441, 8985336947 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Similar News
News November 27, 2025
NARFBRలో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని ICMR-నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ ( NARFBR)7 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD/MS, PhD, B.V.Sc&AH, MVSc, ఫార్మా డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC/ST/Women/PWD/EWSలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://narfbr.org/
News November 27, 2025
ఆదిలాబాద్: సర్పంచ్ స్థానానికి ఏకగ్రీవ తీర్మాణం

ఇంద్రవెల్లి మండలంలోని తేజపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. సర్పంచ్‌తో పాటు 8 మంది వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం తేజపూర్ పరిధిలోని సాలెగూడ, డోబ్బిగూడ, తేజపూర్ గ్రామ పటేల్‌ల ఆధ్వర్యంలో సమావేశమై, కోవా రాజేశ్వర్‌ను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్వచ్ఛందంగా ఎన్నికలు నిర్వహించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
News November 27, 2025
BREAKING: సత్యసాయి జిల్లాలో బాలుడి హత్య

తలుపుల మండల పరిధిలోని గరికపల్లిలో నాలుగేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొమ్మెర హర్షవర్ధన్ అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు బుధవారం సాయంత్రం PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నంబులపూలకుంట(M) గౌకన పేట అడవీ ప్రాంతంలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


