News March 10, 2025

పెద్దపల్లి: నేడు ప్రజావాణి పునః ప్రారంభం

image

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం ఉదయం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా తాత్కాలికంగా కొద్ది వారాల పాటు రద్దు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో తిరిగి ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 10 సోమవారం తిరిగి పునః ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పేర్కొన్నారు. కావున జిల్లాలోని అర్జీదారులు వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News January 9, 2026

తిరుపతి: ‘బస్సు టికెట్ ధరలు పెంచితే చర్యలు’

image

సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ ధరలు పెంచితే చర్యలు తప్పవని తిరుపతి RTO హెచ్చరించారు. జిల్లా కార్యాలయంలో శుక్రవారం ట్రావెల్స్ యజమానులతో సమావేశమై ధరలు, భద్రతా ప్రమాణాలపై దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలపై చర్చించి, ప్రయాణికుల రక్షణకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాత్రివేళల్లో బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

News January 9, 2026

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు

image

తిరుమల కల్తీ నెయ్యి కేసు కీలక మలుపు తిరిగింది. కేసులోని A-34 విజయభాస్కర్(డెయిరీ ఎక్స్‌పర్ట్) నెయ్యి కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడం కోసం లంచం తీసుకున్నట్లు విచారణలో అంగీకరించారని తెలుస్తోంది. కాగా ఆయన ముందస్తు బెయిల్ కోసం నెల్లూరు ACB కోర్టు‌లో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. సిట్ తరఫున అసిస్టెంట్ పీపీ జయశేఖర్ వాదనలు వినిపించారు.

News January 9, 2026

MDK: నిషేధిత చైనా మంజా విక్రయంపై పోలీసుల దాడులు

image

మెదక్ జిల్లా పరిధిలో నిషేధిత చైనా మంజా విక్రయిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మెదక్ టౌన్‌లో గోపీ మధు, నర్సాపూర్ పరిధిలో మహ్మద్ అబేద్, స్వప్నలపై చైనా మంజా విక్రయానికి కేసులు నమోదు చేశారు. చైనా మంజా ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని, విక్రయం, నిల్వ, రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.