News February 27, 2025
పెద్దపల్లి: నేడే పోలింగ్.. అంతా రెడీ!

నేడు జరగనున్న KNR, MDK, ADB, NZB పట్టభద్రుల, టీచర్ MLC ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. జిల్లాలో పట్టభద్రులు 31,037, ఉఫాధ్యాయులు 1,111 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రుల కోసం 36, ఉపాధ్యాయుల కోసం 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పట్టభద్రుల బరిలో 56మంది, ఉపాధ్యాయ స్థానంలో 15మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3 వరకు వేచి ఉండాల్సిందే. 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
Similar News
News December 4, 2025
సిద్దిపేట: ల్యాబ్ టెక్నీషియన్లతో డీఎంహెచ్ఓ సమావేశం

సిద్దిపేట జిల్లాలో జిల్లా వైద్యాధికారి సీహెచ్ ధన్ రాజ్ ఆధ్వర్యంలో జిల్లాలోని లాబ్ టెక్నిషియన్స్ నెలవారి సమీక్ష సమావేశం డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి PHC, CHC, జిల్లా HOSPITALలలో పేషంట్స్కి నిర్వహించే పరీక్షలలో ఎలాంటి అలసత్వాన్ని లేకుండా నిర్వహించాలని, సకాలంలో రిపోర్ట్స్ అందించాలని ఆదేశించారు.
News December 4, 2025
ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం: కందుల

ఆంధ్రప్రదేశ్ లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. గురువారం రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాజమండ్రి నగరం పర్యాటకం, సంస్కృతి & వినోద రంగాల్లో మరింత అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
News December 4, 2025
HYD: త్రివిధ దళాల్లో నౌకాదళం శక్తిమంతం: రంగారావు

త్రివిధ దళాల్లో నౌకాదళం శక్తివంతమైందని, దేశ రక్షణలో కీలకమని నేవీ విశ్రాంత ఆఫీసర్ DP రంగారావు అన్నారు. ‘1969-80 వరకు పని చేశాను. 1971 WARలో ఉన్నాను. 1970-76లో ఒకే షిప్లో 6 ఏళ్లు 28 దేశాలు ప్రయాణించాను. 1976లో INS వీరబాహు సబ్ మెరైన్ బేస్ మెయింటెనెన్స్ మెరైన్ ఇంజినీర్గా విధులు నిర్వహించాను. సంగ్రామ్ మెడల్, పశ్చిమ స్టార్ మెడల్స్ అందుకున్నాను’ అని నేవీ డే వేళ హయత్నగర్లో ఆయన Way2Newsతో మాట్లాడారు.


