News February 27, 2025
పెద్దపల్లి: నేడే పోలింగ్.. అంతా రెడీ!

నేడు జరగనున్న KNR, MDK, ADB, NZB పట్టభద్రుల, టీచర్ MLC ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. జిల్లాలో పట్టభద్రులు 31,037, ఉఫాధ్యాయులు 1,111 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రుల కోసం 36, ఉపాధ్యాయుల కోసం 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పట్టభద్రుల బరిలో 56మంది, ఉపాధ్యాయ స్థానంలో 15మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3 వరకు వేచి ఉండాల్సిందే. 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
Similar News
News March 17, 2025
NRPT: ప్రజావాణికి 30 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 30 ఫిర్యాదులు వచ్చాయన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు.
News March 17, 2025
నియోజకవర్గానికి 4-5వేల మందికి సాయం: సీఎం రేవంత్

TG: ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగులకు అర్హత ప్రకారం అమలు చేస్తామని CM రేవంత్ తెలిపారు. ఒక్కొక్కరికి ₹50వేల నుంచి ₹4లక్షల వరకు మంజూరు చేస్తామన్నారు. ‘రాబోయే 2 నెలల్లో డబ్బులు మీ చేతుల్లో పెడతాం. జూన్ 2న 5లక్షల మంది లబ్ధిదారులను ప్రకటిస్తాం. నియోజకవర్గానికి 4-5వేల మందిని ఎంపిక చేస్తాం’ అని పేర్కొన్నారు.
News March 17, 2025
‘ఫ్యామిలీ రూల్’పై అనుష్క శర్మ పోస్ట్.. వైరల్

బీసీసీఐ ప్రవేశపెట్టిన ‘ఫ్యామిలీ రూల్’పై టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పరోక్షంగా స్పందించారు. ‘నువ్వు తెలిసిన ప్రతి ఒక్కరి మనసులో నీ గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. కానీ నువ్వేంటో నీకు మాత్రమే తెలుసు’ అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా టూర్లలో క్రికెటర్లతోపాటు వారి కుటుంబాలు, సన్నిహితులు ఉంటే బాగుంటుందని విరాట్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.