News March 15, 2025
పెద్దపల్లి: పండుగ పూట విషాదం.. నలుగురి మృతి

ఉమ్మడి KNR జిల్లాలో నిన్న వేర్వేరు ఘటనల్లో నలుగురు చనిపోయారు. PDPL జిల్లా కమాన్‌పూర్(M) గుండారానికి చెందిన ఓదెలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. JGTL రూరల్(M) వెల్దుర్తిలోని కెనాల్‌లో ఈతకు వెళ్లి సాగర్‌గౌడ్ చనిపోయాడు. KNR జిల్లా ఇల్లందకుంట(M) చిన్నకోమటిపల్లిలో <<15762521>>బైక్<<>> అదుపుతప్పి JMKTకు చెందిన అనుదీప్ మృతిచెందాడు. SRCL జిల్లా చందుర్తికి చెందిన వామిక అనే 16 నెలల చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది.
Similar News
News April 24, 2025
ఎల్కతుర్తి సభ ఏర్పాట్లపై సీపీతో సమావేశం

ఈనెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ ఏర్పాట్లకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్‌తో సభ ఏర్పాట్లపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చర్చించారు. సభకు సంబంధించిన భద్రత ఏర్పాట్లు, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకునే చర్యల గురించి రూట్ మ్యాప్ సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీతిసింగ్‌తో సమావేశం అయ్యారు.
News April 24, 2025
విశాఖలో పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలు

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ జె.సుభద్రతో కలిసి కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. వీరు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బలమైన భారతదేశానికి బలమైన గ్రామ పాలన అవసరమని జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం గుర్తు చేస్తుందన్నారు.
News April 24, 2025
నిర్మల్: వడదెబ్బతో యువకుడి మృతి

వడదెబ్బతో యువకుడు మృతి చెందిన ఘటన నిర్మల్‌లో గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని బ్రహ్మపురికి చెందిన మహ్మద్ బేగ్ కుమారుడైన సోఫీ బేగ్ వడదెబ్బ తగలడంతో రెండు రోజుల నుంచి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ నిర్మల్ ఆసుపత్రిలో మృతిచెందారు. సోఫీ బేగ్ మూడ నెలల కిందటే దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చారు.