News November 13, 2024
పెద్దపల్లి: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రాకపోకలకు అంతరాయం

పెద్దపల్లి జిల్లా రాఘవపూర్- కన్నాల మధ్యలో గూడ్స్ రైలు పట్టాలు తప్పి ఆరు బోగీలు పడిపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి గజియాబాద్ నుంచి కాజీపేట వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఎక్కడికక్కడ పట్టాలపై నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు.
Similar News
News December 5, 2025
వలస కూలీల పిల్లలను బడిలో చేర్చాలి: KNR కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో వలస కూలీలు, ఇటుక బట్టీల కార్మికుల పిల్లలను గుర్తించి ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యాధికారులను ఆదేశించారు. పిల్లలకు రవాణా సాయం అందించాలని ఇటుక బట్టీల యజమానులను కోరారు. అలాగే, పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, స్పెషల్ క్లాస్‌లు పర్యవేక్షించి నూరు శాతం ఫలితాలు సాధించాలని సూచించారు.
News December 5, 2025
ఎన్నికల భద్రతపై సమీక్షించిన సీపీ

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల భద్రతపై కరీంనగర్ సీపీ గౌష్ ఆలం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 104 రూట్లు, 57 క్లస్టర్లను ఏర్పాటు, 508 మళ్లీ సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, భద్రతా ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 4, 2025
కరీంనగర్: మూడు గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం

కరీంనగర్ జిల్లా మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో మూడుచోట్ల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చొప్పదండి మండలం దేశాయిపేటలో తిరుపతి, పెద్దకురుమపల్లిలో స్వరూప ఏకగ్రీవం కాగా, రామడుగు మండలం శ్రీరాములపల్లిలో సుగుణమ్మ సర్పంచ్‌గా ఖరారయ్యారు. దేశాయిపేటలో సర్పంచ్‌తో పాటు పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా తెలిపారు.


