News March 29, 2025
పెద్దపల్లి: పరువు హత్య UPDATE..

ఎలిగేడు మండలం ముప్పిరితోటలో ప్రేమ వ్యవహారంతో యువకుడి హత్య కేసుకు సంబంధించి పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. A-1 ముత్యం సదయ్య (యువతి తండ్రి), A-2 ముత్యం సమత (యువతి తల్లి), A-3 సిద్ధ సారయ్య (యువతి మేనమామ) పై హత్య కేసు నమోదు చేశారు. హత్యకు ప్రేరేపించిన ఇతరులపై కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 1, 2025
ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన తప్పనిసరి: మన్యం కలెక్టర్

ఎయిడ్స్ వ్యాధి నివారణపై యువత తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురంలోని కలెక్టరేట్లో సోమవారం మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా అరికట్టాలంటే నివారణ ఒక్కటే మార్గమని, వ్యాధిగ్రస్తులను చులకనగా చూడొద్దన్నారు. వ్యాధి సోకిన వారు అపోహలు మాని ఆసుపత్రులకు వెళ్లి తగిన చికిత్స చేయించుకోవాలని సూచించారు.
News December 1, 2025
హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం: CBN

AP: విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే పనిలో ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏలూరు(D) నల్లమాడులో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన అక్కడి సభలో మాట్లాడారు. ‘94% స్ట్రైక్ రేట్తో గెలిపించారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News December 1, 2025
HYD: కరెంటు బిల్లే క్రెడిట్ స్కోరు.!

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో ప్రభుత్వం కీలక ఆర్థిక సంస్కరణను ప్రకటించనుంది. ‘రుణ చరిత్ర లేని’ ప్రజల కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB) ఏర్పాటు కానుంది. ఈ సంస్థ కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు వంటి చెల్లింపుల రికార్డులను పరిశీలించి ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ను ఇస్తుంది. ఈ స్కోరు ఆధారంగా బ్యాంకులు లక్షలాది మందికి రుణాలు అందించే అవకాశం ఉందని అధికారులు Way2Newsకు తెలిపారు.


