News February 14, 2026

పెద్దపల్లి: పురపోరులో మహిళల విజయ దుందుభి

image

పెద్దపల్లి జిల్లాలోని 124 వార్డు స్థానాలలో అత్యధిక శాతం వార్డులలో మహిళలు విజయ దుందుభి మోగించారు. మొత్తం 4 పురపాలికల్లో 65 మంది మహిళలు విజయం సాధించారు. రామగుండం నగరపాలక సంస్థలో 32(60) మంది, పెద్దపల్లిలో 19 (36), సుల్తానాబాద్ లో 8 (15), మంథనిలోఆరుగురు(13) గెలుపొందారు. సగానికంటే ఎక్కువ మంది మగువలే ప్రాతినిధ్యం వహించనున్నారు.

Similar News

News March 7, 2026

KKD: పదోన్నతులు ఇచ్చారు.. జీతాలు ఇవ్వడం మరిచారు!

image

కాకినాడ జిల్లాలో పదోన్నతి పొందిన 60 మంది సచివాలయ అధికారులకు నెలల తరబడి జీతాలు అందకపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 1న DyCM చొరవతో ప్రమోషన్లు వచ్చినప్పటికీ, నేటికీ వేతనాలు రాలేదని వాపోతున్నారు. పంచాయతీరాజ్ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని అధికారులు ఆరోపిస్తున్నారు. తమకు వెంటనే జీతాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

News March 7, 2026

BREAKING: భారీ షాక్ ఇచ్చిన బంగారం ధర

image

కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,300 ఎగబాకి రూ.1,50,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.

News March 7, 2026

Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

image

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్‌ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్‌ వాట్సాప్‌కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.