News January 24, 2025
పెద్దపల్లి: పోటీ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు

పోటీ పరీక్షల బేసిక్ ఫౌండేషన్ కోర్స్ దరఖాస్తు గడువు ఫిబ్రవరి 15 వరకు పొడిగించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జె.రంగారెడ్డి పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హత పాత్రలతో దరఖాస్తులు పెద్దపల్లి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. జిల్లాలోని ముస్లిం, క్రిస్టియన్, పార్శి, బౌద్ధులు, సిక్కులు, జైన కులస్తులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
దీపాల కింద కూర్చుని చదువుకున్నా: CJI

ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన తాను <<18373221>>CJI<<>> అవుతానని ఎప్పుడూ అనుకోలేదని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. అప్పట్లో న్యాయవ్యవస్థ అంటే ఏంటో కూడా తెలియదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మా ఊరికి విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండేది కాదు. దీపాల కింద కూర్చుని చదువుకున్నా. లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు సీనియర్లు ఎంతో సాయం చేశారు. హైకోర్టుకెళ్లాక 5-6 ఏళ్లలోనే విజయవంతమైన లాయర్‌గా పేరు తెచ్చుకున్నా’ అని చెప్పారు.
News November 24, 2025
నిజామాబాద్: కాంగ్రెస్, BRSపై అర్బన్ ఎమ్మెల్యే ఫైర్!

కాంగ్రెస్, BRSపై నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఫైర్ అయ్యారు. రైతులను గాలికి వదిలేయడంలో BRS, కాంగ్రెస్ రెండు పార్టీలు దొందూ దొందే అని విమర్శించారు. రైతులకు ఎరువులు అందించడంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ విఫలమయ్యారని ట్వీట్ చేశారు.
News November 24, 2025
సింగూరు డ్యామ్‌లో 1 నుంచి ‘ఖాళీ’ పనులు

మహానగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం మరమ్మతులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలంటే ముందుగా జలాశయంలో నీటిమట్టం తగ్గించాలి. అందుకే వచ్చేనెల ఒకటో తేదీ నుంచి రోజుకు 30 సెంటీమీటర్లు నీటిని తోడేయాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. నీటిమట్టాన్ని 517.8 మీటర్లకు తెచ్చి (ప్రస్తుత నీటిమట్టం 520.49 మీ.) ఆ తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.


