News March 3, 2025
పెద్దపల్లి: పోలీస్ స్టేషన్‌ను పేల్చి 29 ఏళ్లు

PDPL జిల్లా ఓదెల(M) పొత్కపల్లి పోలీస్ స్టేషన్‌ను మావోయిస్టులు పేల్చిన ఘటనకు నేటితో 29ఏళ్లు. 1996 మార్చి 3న జరిగిన ఈ ఘటనతో దేశమే ఉలిక్కిపడింది. దాడిలో కానిస్టేబుల్ షేక్ దాదా మరణించగా.. అప్పటి SI శ్రీధర్ రావుతో పాటు పోలీస్ సిబ్బందిని నక్సల్స్ అధీనంలోకి తీసుకున్నారు. ఎట్టకేలకు 2003లో అప్పటి SP RS ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త స్టేషన్‌ను నిర్మించి హోంమంత్రి దేవేందర్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు.
Similar News
News December 9, 2025
ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయాలి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్

రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ నెల 11వ తేదీన జరగబోయే తొలి విడత ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్లు, ఎస్పీలు, పరిశీలకులను ఆమె ఆదేశించారు.
News December 9, 2025
పేదలు, రైతుల చుట్టే నా ఆలోచనలు: CM రేవంత్

తన ఆలోచనలు, TG విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు పేదలు, రైతుల చుట్టే తిరుగుతాయని CM రేవంత్ అన్నారు. ‘నేను ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చా. SC, ST, BC, మైనారిటీలతో కలిసి పెరిగా. వారి సమస్యలు తెలుసు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌తో పాటు కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నాం. చైనా, జపాన్, కొరియా, సింగపూర్ మాకు రోల్ మోడల్స్. అభివృద్ధిలో వాటితో పోటీ పడతాం’ అని డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
News December 9, 2025
WGL: ఉద్యోగులారా.. పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోండి..!

ఎన్నికల విధులకు నియమించిన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 11, 14, 17న ఎన్నికలు జరుగుతుండగా ఉద్యోగులు తమ ఓటు హక్కు ఉన్న మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేయవచ్చు. ఇందుకోసం వారు ఎన్నికల డ్యూటీ ఆర్డర్ కాపీ, ఉద్యోగ గుర్తింపు కార్డు, ఓటరు కార్డును ఆ సెంటర్లో ఇచ్చే ఫారం-14, 15జత చేసి ఓటేయొచ్చు.


