News March 3, 2025

పెద్దపల్లి: పోలీస్ స్టేషన్‌ను పేల్చి 29 ఏళ్లు

image

PDPL జిల్లా ఓదెల(M) పొత్కపల్లి పోలీస్ స్టేషన్‌ను మావోయిస్టులు పేల్చిన ఘటనకు నేటితో 29ఏళ్లు. 1996 మార్చి 3న జరిగిన ఈ ఘటనతో దేశమే ఉలిక్కిపడింది. దాడిలో కానిస్టేబుల్ షేక్ దాదా మరణించగా.. అప్పటి SI శ్రీధర్ రావుతో పాటు పోలీస్ సిబ్బందిని నక్సల్స్ అధీనంలోకి తీసుకున్నారు. ఎట్టకేలకు 2003లో అప్పటి SP RS ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త స్టేషన్‌‌ను నిర్మించి హోంమంత్రి దేవేందర్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు.

Similar News

News February 26, 2026

మెట్‌పల్లి: పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

image

ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం మొదటి పరీక్ష సందర్భంగా గురువారం మెట్‌పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నాపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

News February 26, 2026

నెల్లూరులో కొత్త మోసం.. జాగ్రత్త!

image

ఆన్‌లైన్ దోపిడీకి సైబర్ నేరగాళ్లు మరో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. RTO ఆఫీస్ చలానా పేరుతో వాట్సాప్‌కు APK ఫైల్స్ పంపిస్తున్నారు. నెల్లూరులో కొందరు వీటిని క్లిక్ చేశారు. వారి నుంచి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఏపీకే ఫైల్ ఆటోమేటిక్‌గా ఫార్వర్డ్ అవుతోంది. ఇలాంటి వాటిని క్లిక్ చేస్తే నగదు దోచేస్తారని.. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News February 26, 2026

ప్రభుత్వ విద్యార్థుల ట్రాన్స్‌పోర్టుపై సీఎం కీలక ఆదేశాలు

image

TG: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ట్రాన్స్‌పోర్టుకు ఎలక్ట్రిక్ బస్‌ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్ మినహా మిలిగిన నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కో మండలంలో ట్రాన్స్‌పోర్ట్ సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఇక బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌లో తప్పనిసరిగా పాలు అందించాలని, అందుకోసం విజయ డెయిరీ నుంచి మిల్క్ సేకరించాలని చెప్పారు.