News March 3, 2025
పెద్దపల్లి: పోలీస్ స్టేషన్‌ను పేల్చి 29 ఏళ్లు

PDPL జిల్లా ఓదెల(M) పొత్కపల్లి పోలీస్ స్టేషన్‌ను మావోయిస్టులు పేల్చిన ఘటనకు నేటితో 29ఏళ్లు. 1996 మార్చి 3న జరిగిన ఈ ఘటనతో దేశమే ఉలిక్కిపడింది. దాడిలో కానిస్టేబుల్ షేక్ దాదా మరణించగా.. అప్పటి SI శ్రీధర్ రావుతో పాటు పోలీస్ సిబ్బందిని నక్సల్స్ అధీనంలోకి తీసుకున్నారు. ఎట్టకేలకు 2003లో అప్పటి SP RS ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త స్టేషన్‌ను నిర్మించి హోంమంత్రి దేవేందర్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు.
Similar News
News March 27, 2025
రాత్రి 7.30కు పవర్ కట్ అంటూ సైబర్ మోసం

TG: సైబర్ నేరగాళ్లు కొత్త మోసంతో మాయ చేస్తున్నారు. ‘మీరు గత నెల కరెంట్ బిల్ చెల్లించలేదు. ఇవాళ రాత్రి 7.30కు పవర్ కట్ అవుతుంది’ అని పలువురు వినియోగదారుల మొబైల్స్‌కు మెసేజ్‌లు పంపుతున్నారు. దీనిపై విద్యుత్ శాఖ వర్గాలు స్పందించాయి. TGSPDCL ఎప్పుడూ ఇలాంటి మెసేజ్‌లు పంపదని, ఉద్యోగులెవరూ వినియోగదారుల బ్యాంక్ ఖాతా నంబర్లు తీసుకోరని స్పష్టం చేశాయి. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.
News March 27, 2025
సిద్దిపేట: ‘సెర్ఫ్ లక్ష్యాలను చేరుకోవాలి’

సెర్ఫ్ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, సెర్ఫ్ కార్యక్రమాలపై సెర్ఫ్ సీఈఓ డి. దివ్యతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి, అదనపు కలెక్టర్లు గరీమ అగ్రవాల్, అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు.
News March 27, 2025
ఉప్పల్‌లో SRH, మహేశ్ బాబు FANS

ఉప్పల్ స్టేడియం వద్ద SRH, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన పలువురు యువత ఆరెంజ్ ఆర్మీ టీషర్ట్స్, మహేశ్ బాబు బ్యానర్‌తో స్టేడియానికి చేరుకున్నారు. ఈ సారి SRH బ్యాటింగ్‌కు దిగితే 300 స్కోర్ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ రావడంతో స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.