News February 18, 2025
పెద్దపల్లి: పోస్ట్ కార్డు ద్వారా విద్యార్థుల ఆవేదన

CHO పెద్దపల్లి పట్టణంలోని ఒకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు తమ సమస్యలను పోస్ట్ కార్డు రూపంలో వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, స్కూటీలు, రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పెద్దపల్లి నియోజకవర్గ BRS నాయకురాలు దాసరి ఉష తెలుసుకున్నారు. హామీలను అమలు చేయాలని విద్యార్థులు తమ పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు.
Similar News
News March 19, 2025
పెద్దపల్లి: బడ్జెట్‌పైనే భారమంతా..!

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఉమ్మడి KNR జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్‌లో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, ఓదెల, కాళేశ్వరం, ఇల్లందకుంట ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని భక్తులు కోరుతున్నారు. జమ్మికుంట బస్సుడిపో ఏర్పాటు, కల్వల ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి KNR జిల్లాకు ఇంకేం కావాలో కామెంట్ చేయండి.
News March 19, 2025
తిరుపతి: ఓ వైపు పది పరీక్షలు.. మరో వైపు కరెంట్ కోతలు

విద్యార్థులకు ఎంతో ముఖ్యమైన పదో తరగతి పరీక్షల సమయంలో గ్రామాల్లో కరెంట్ కోతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రేణిగుంట(మం), కరకంబాడి పంచాయతీ, మామండూరు పంచాయతీల్లో మంగళవారం రాత్రి కరెంట్ సరఫరా లేకపోవడంతో పదో తరగతి విద్యార్థులు చిమ్మ చీకటిలో గడిపారు. గొల్లపల్లి పంచాయతీ సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌లో సమస్య తలెత్తడంలో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని డీఈ రమేశ్ తెలిపారు.
News March 19, 2025
రాయవరం: రాజు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు

ఇద్దరు పిల్లల్ని కాలువలో తోసేసి పరారైన రాయవరం (M) వెంటూరుకు చెందిన పిల్లి రాజు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతని ఆచూకీ తెలియలేదని మంగళవారం తెలిపారు. రామచంద్రపురం (M) నెలపర్తిపాడు శివారు గణపతి నగరంలో పంట కాలువలోకి కుమారుడు రామ్ సందీప్, కుమార్తె కారుణ్యశ్రీని తండ్రి రాజు కాలువలోకి గెంటేసి పరారైన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు.