News January 26, 2025
పెద్దపల్లి ప్రజల చిరకాల కోరిక నెరవేరింది: కలెక్టర్

పెద్దపల్లి ప్రజల చిరకాల కోరిక ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాట్లను ప్రభుత్వం నెరవేర్చిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో జరిగిన అభివృద్ధి పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపీడీవో ప్రాంగణంలోని భూమి ఆర్టీసీ కు అప్పగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పెద్దపల్లిలో పరిశ్రమ శాఖ, ప్రజా పంపిణీ వ్యవస్థ, మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తున్నామన్నారు.
Similar News
News December 31, 2025
BSNL బంపర్ ఆఫర్!

ప్రైవేట్ టెలికం సంస్థలు రీఛార్జ్ ధరలు పెంచి వినియోగదారులపై భారం మోపుతుంటే BSNL మాత్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది. యూజర్లను ఆకర్షించేందుకు పాత ధరలకే అదనపు డేటాను అందిస్తోంది. ₹2399, ₹485, ₹347, ₹225 వంటి ప్రీపెయిడ్ ప్లాన్లపై ఇప్పుడు రోజుకు 2.5GB నుంచి 3GB వరకు డేటాను పొందొచ్చు. గతంలో ఈ ప్యాక్‌లపై 2GB/ 2.5GB వచ్చేది. ఈ ప్రత్యేక ఆఫర్ 2026 జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుందని BSNL ప్రకటించింది.
News December 31, 2025
సినిమాను మించిన సక్సెస్ స్టోరీ.. ఎందరికో ఆదర్శం!

ఒకప్పుడు వీధుల్లో భిక్షాటన చేసిన కర్ణాటకకు చెందిన రేణుకా ఆరాధ్య నేడు వందలాది మందికి ఉపాధినిస్తున్నారు. పేదరికం వల్ల బాల్యంలో తండ్రితో కలిసి ఆలయాల ముందు భిక్షాటన చేసిన ఆయన సెక్యూరిటీగార్డుగా, క్లీనర్‌గా చేసి ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ డ్రైవర్‌గా మారడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. సొంతంగా కారు కొని ‘ప్రవాసీ క్యాబ్స్’ ప్రారంభించి దానిని రూ.40 కోట్ల టర్నోవర్ కంపెనీగా మార్చి ఔరా అనిపించారు.
News December 31, 2025
విభూది మహిమ..

విభూతి వెనుక ఆరోగ్య రహస్యాలెన్నో ఉన్నాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరాన్ని వెచ్చగా, ఎండగా ఉన్నప్పుడు చల్లగా ఉంచుతుంది. చర్మ రంధ్రాలను క్రమబద్ధీకరించి లోపలి శక్తి బయటకు పోకుండా కాపాడుతుంది. అందుకే మైనస్ డిగ్రీల చలిలో కూడా నాగసాధువులు విభూతిని పూసుకుని జీవించగలుగుతారు. పూర్వం స్వెటర్లు లేని రోజుల్లో పిల్లలకు చలి తగలకుండా విభూతిని ఒంటికి పూసేవారు.


