News August 23, 2024
పెద్దపల్లి: ప్రతి ఇంట్లో పేషంట్లే!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో చికున్ గున్యా పంజా విసురుతోంది. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే మిగతా వాళ్లందరికీ జ్వరం వస్తోంది. కీళ్ల నొప్పులతో మంచం పట్టి, లేవలేని పరిస్థితి. ప్రతి ఇంట్లో జ్వర పీడితులు ఉన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆసుపత్రిలో ప్రతిరోజూ 60 నుంచి 70 మందికి రక్త పరీక్షలు చేస్తున్నారు.
Similar News
News January 22, 2026
కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం ఎప్పుడో ?

KNR నూతన కలెక్టరేట్ ప్రారంభం మరోసారి ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి సీఎం చేతుల మీదుగా ప్రారంభం కావాల్సినా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అద్దె భవనాలు ఖాళీ చేయాలని, వివిధ శాఖల్లో అందుబాటులో ఉన్న భవనాల వివరాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నూతన కలెక్టరేట్ ప్రారంభం మరింత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
News January 22, 2026
కరీంనగర్ ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్‌మేళా

కరీంనగర్ ఉపాధి కార్యాలయంలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌డీబీ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని, ఇంటర్ ఆపై చదివిన 20 నుంచి 30 ఏళ్లలోపు వయస్సున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు సర్టిఫికెట్స్ జిరాక్సు కాపీలతో కశ్మీర్‌గడ్డలోని ఈసేవ పైఅంతస్తున గల ఉపాధి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హాజరు కావాలన్నారు.
News January 22, 2026
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ మార్కెట్ రోడ్డులో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు సాగే ఈ వేడుకలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, కళ్యాణ మండపం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


