News February 17, 2025
పెద్దపల్లి: ప్రతి విద్యార్థి హాజరు ఎఫ్.ఆర్.ఎస్ ద్వారా నమోదుచేయాలి: కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి హాజరు ఎఫ్.ఆర్.ఎస్ ద్వారా కట్టుదిట్టంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో బాలికల హాజరు శాతం, మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యార్థినులకు అందుతున్న విద్యా బోధన తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు.
Similar News
News April 14, 2026
ములుగు: ఇంటర్ ఫలితాల్లో టాపర్లుగా అక్కా, తమ్ముడు

ఏటూరునాగారంలో అక్కా-తమ్ముడు టాపర్లుగా నిలిచి అందరి ప్రశంసలు పొందారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న పెండ్యాల చైత్రశ్రీ 982 మార్కులు సాధించి కళాశాల, మండల టాపర్‌గా నిలిచింది. అదే కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న ఆమె తమ్ముడు చైతన్య 451 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచాడు. ఒకే కళాశాలలో చదువుతూ ఇద్దరూ టాపర్లుగా నిలవడం విశేషం.
News April 14, 2026
సాగర్ ఎడమ కాల్వకు నిలిచిన సాగునీరు

నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు సాగునీటి విడుదలను అధికారులు ఇవాళ ఉదయం నిలిపివేశారు. సాగు అవసరాలు తీరడం, పంట కోతలు ప్రారంభం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరిగేషన్ శాఖ తెలిపింది. ప్రస్తుతం డ్యామ్‌లో 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 163 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎండాకాలం దృష్ట్యా తగ్గుతున్న నీటి నిలువలను కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
News April 14, 2026
GNT: రీ-సర్వే సమస్యల పరిష్కారానికి చర్యలు

భూముల రీ-సర్వేలో వచ్చిన లోపాలను సరిచేయడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. గురువారం రైతులకు మ్యుటేషన్, సబ్‌డివిజన్‌కు అవకాశం కల్పించారు. జూన్ 30 వరకు రాయితీ ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సాధారణంగా రూ.550 ఉండే ఫీజు, గడువులో రూ. 50కే పరిమితం చేశారు. రీ-సర్వేలో ఎల్పీఎం నంబర్లు, భూమి వివరాలు తారుమారవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యల పరిష్కారానికి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.


