News February 6, 2025
పెద్దపల్లి: ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలి: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో వైద్య అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు.
Similar News
News February 9, 2026
స్వల్ప వృద్ధితోనే గుంటూరు జిల్లా ఆదాయ వసూళ్లు

గుంటూరు జిల్లా మున్సిపల్ ఆదాయ వసూళ్లలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా మొత్తం వసూలు చేయాల్సింది ₹452.15 కోట్లుగా నమోదైంది. ఫిబ్రవరి 9 వరకు వసులుచేసింది ₹152.35 కోట్లు మాత్రమే అది 33.70%గా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ₹152.29 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది స్వల్పంగా 3.90% వృద్ధి నమోదైంది. లక్ష్య సాధనలో ఇంకా వేగం పెంచాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
News February 9, 2026
NTR: అక్రమాలు అరికట్టెందుకు.. డిజిటల్ యంత్రం!

కనకదుర్గమ్మ ఆలయ టికెట్ల నకిలీ జిరాక్స్ దందాను అరికట్టేందుకు అధికారులు సరికొత్త చర్యలు చేపట్టారు. ఒకే ఆన్‌లైన్ టికెట్‌ను పలువురు వాడుతూ ఆలయ ఆదాయానికి గండి కొడుతుండటంతో, రైల్వే స్టేషన్ తరహాలో ‘డిజిటల్ కియోస్క్’ యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతం ట్రయల్ రన్ సాగుతోంది. ఈ యంత్రాల ద్వారా భక్తులు నేరుగా నగదు చెల్లించి, తమకు కావాల్సిన పూజా టికెట్లను వివిధ భాషల్లో పొందవచ్చు. త్వరలో రానున్నాయి.
News February 9, 2026
విమానాల నిర్వహణపై డిప్లొమా కోర్సు

TG: డిప్లొమా ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్(AME) కోర్సును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వచ్చే విద్యా సంవత్సరం ఓ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రవేశపెట్టి తర్వాత విస్తరించనుంది. ఒక్కో కాలేజీలో 60 సీట్లు ఉంటాయని తెలుస్తోంది. విమాన మరమ్మతులు, నిర్వహణ, సర్టిఫై తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కొత్తగా సెమీకండక్టర్, ఆటోమేషన్& రోబోటిక్స్ వంటి మరో 9 కోర్సులు ప్రవేశపెట్టనున్నారు.


