News April 12, 2025

పెద్దపల్లి: బాలికపై యువకుడి అత్యాచారయత్నం.. అరెస్టు

image

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సనత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నవదీప్ (22) గురువారం మధ్యాహ్నం అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరిచారు.

Similar News

News July 9, 2025

ఎన్టీఆర్ జిల్లాలో బంగారు కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే.?

image

ఎన్టీఆర్ జిల్లాలో P-4 పథకంలో లబ్ధి పొందనున్న బంగారు కుటుంబాల సంఖ్య 86 వేలకు చేరిందని కలెక్టర్ లక్ష్మీశా చెప్పారు. ఈ కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసేందుకు 400 మందికిపైగా మార్గదర్శకులు ఉన్నారన్నారు. పేదరికం లేని సమాజం తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన ఈ పథకంలో ఆయా కుటుంబాల సంక్షేమానికై మార్గదర్శకులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

News July 9, 2025

ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్ సీజ్ చేసిన సిట్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు. డేటా విశ్లేషణ కోసం FSLకు పంపించారు. ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్‌మెంట్‌ను రికార్డును చేశారు. 2023 నవంబర్ 15-30 వరకు సర్వీస్ ప్రొవైడర్ డేటాలోని ఫోన్ నంబర్లు, డేటా రిట్రైవ్, హార్డ్ డిస్క్‌లోని రహస్యాలపై సిట్ ఆరా తీసింది. రేపు ప్రభాకర్ రావును సిట్ మరోసారి విచారించనుంది.

News July 9, 2025

BHPL: త్వరలో నోటిఫికేషన్.. ఆశావహుల వ్యూహాలు

image

ఈ నెలాఖరులో పంచాయతీ, MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఆశావహ అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ప్రజలను కలుస్తూ వారి ఉద్దేశ్యాన్ని వివరిస్తున్నారు. ఇదిలా ఉండగా రిజర్వేషన్ కలిసి రాకపోతే పరిస్థితి ఏంటని పోటీ చేయాలనుకునే అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పరిస్థితులు అనుకూలించకపోతే, మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచనలు చేస్తున్నారు.