News February 3, 2025

పెద్దపల్లి బీజేపీ అధ్యక్షుడిగా సంజీవరెడ్డి

image

ఓదెల మండలం కొలనూర్‌కి చెందిన సంజీవ రెడ్డి బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీ తెలంగాణ సంఘటన పర్వ్- 2024 ఎన్నికల నియమావళి ఆధారంగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి క్ష్మీ నారాయణ సంజీవను అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా బీజేపీ పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి శ్రీకాంత్ నియామక పత్రాన్ని విడుదల చేశారు. తన నియామకానికి సహకరించిన వారికి అయన కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News February 3, 2025

U19 WC టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్.. లిస్టులో నలుగురు భారత ప్లేయర్లు

image

U19 మహిళల WCలో సత్తా చాటిన 12 మంది ఆటగాళ్లతో ICC టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి త్రిషతో పాటు కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవిశర్మ చోటు దక్కించుకున్నారు.
జట్టు: త్రిష, బోథా(SA), పెర్రిన్(ENG), కమలిని, కావోయిహ్మ్ బ్రే(AUS), పూజా మహతో(NEP), కైలా రేనెకే(కెప్టెన్-SA), కేటీ జోన్స్(ENG), ఆయుషి శుక్లా, చమోడి ప్రబోద(SL), వైష్ణవి శర్మ, తాబిసెంగ్(SA).

News February 3, 2025

కడప: YVU పీజీ పరీక్షా ఫలితాలు విడుదల

image

వైవీయూ, అనుబంధ కళాశాలల ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం మూడో సెమిస్టర్ పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తమ చాంబరులో రిజిస్ట్రార్ ప్రొ పి.పద్మ, సీఈ ప్రొ కెఎస్వీ కృష్ణారావుతో కలిసి పీజీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం https:www.yvuexams.in/results.aspx అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. ఏసీఈలు డా.మమత, డా.శ్రీనివాసులు పాల్గొన్నారు.

News February 3, 2025

గ్రూప్-1 ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్

image

TG: గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో త్వరలోనే గ్రూప్-1 ఫలితాలు విడుదల కానున్నాయి.