News February 3, 2025
పెద్దపల్లి బీజేపీ అధ్యక్షుడిగా సంజీవరెడ్డి

ఓదెల మండలం కొలనూర్‌కి చెందిన సంజీవ రెడ్డి బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీ తెలంగాణ సంఘటన పర్వ్- 2024 ఎన్నికల నియమావళి ఆధారంగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి క్ష్మీ నారాయణ సంజీవను అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా బీజేపీ పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి శ్రీకాంత్ నియామక పత్రాన్ని విడుదల చేశారు. తన నియామకానికి సహకరించిన వారికి అయన కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 16, 2025
SRD: మ్యాట్రిమోని పేరుతో డబ్బులు వసూలు.. నిందితుడి అరెస్ట్

మ్యాట్రిమోని పేరుతో అమ్మాయిలతో పరిచయం పెంచుకొని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నిందితుడిని చేర్యాల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చేర్యాల సీఐ తెలిపిన వివరాలు.. కర్నూల్‌కు చెందిన గుమ్మనా వివేకానంద రెడ్డి చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత అమ్మాయి నుంచి రూ.5 లక్షలకు పైగా వసూలు చేసినట్టు తెలిపారు. మోస పోయిన అమ్మాయి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు.
News February 16, 2025
జలుమూరు: మూడు రోజులపాటు రైల్వే గేటు మూసివేత

జలుమూరు మండలం తిలారు రైల్వే గేటు ఈ నెల 17, 18, 20 తేదీల్లో మూసి వేస్తున్నట్లు రైల్వే సెక్షన్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పలాస నుంచి శ్రీకాకుళం వరకు రైలు మార్గంలో మరమ్మతులు చేపడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ దారిలో ప్రయాణించే వాహనాలు మళ్లింపు చేస్తున్నామని ప్రయాణికులు సహకరించాలని కోరారు.
News February 16, 2025
త్వరలోనే నాగర్‌కర్నూల్‌కు రైల్వే లైన్: కేంద్రమంత్రి

నాగర్‌కర్నూల్ పార్లమెంట్ బీజేపీ నాయకుడు భరత్ ప్రసాద్ ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌కు సంబంధించిన పలు అంశాల గురించి కేంద్రమంత్రికి వివరించినట్లు భరత్ ప్రసాద్ తెలిపారు. త్వరలోనే నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌కు రైల్వే లైన్ వస్తుందన్నారు.