News March 25, 2025

పెద్దపల్లి బైపాస్ సిద్ధం.. సమయం ఆదా!

image

పెద్దపల్లి రైల్వే బైపాస్‌కు రంగం సిద్ధమైంది. కాజీపేట – బల్లార్షా – పెద్దపల్లి – నిజామాబాద్‌ను కలిపేలా నిర్మించిన రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనులు ఈ నెల 28 వరకు జరగనున్నాయి. ఉగాది నుంచి ఈ లైన్ అందుబాటులోకి రానుంది. ఇకపై ప్రతీ రైలుకు 40 నిమిషాలు సమయం ఆదా కానుంది. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 23, 2025

27న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు: ఖమ్మం DEO

image

తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 27న (ఆదివారం) నాడు నిర్వహిస్తున్నట్లు DEO సోమశేఖర్ వర్మ తెలిపారు. 6వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7-10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడతాయని చెప్పారు. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా పత్రాల లీకేజీ వదంతులు నమ్మవద్దని సూచించారు.

News April 23, 2025

ADB: ఈనెల 28 నుంచి కేయూ సెమిస్టర్ పరీక్షలు

image

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్, డిగ్రీ(బ్యాక్ లాగ్) మొదటి, మూడో, ఐదవ సెమిస్టర్ పరీక్షలను ఈనెల 28 నుంచి నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా కొన్ని కళాశాలలు పరీక్షా ఫీజులు, నామినల్ రోల్స్ అందించని కారణాలతో వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ తెలిపారు. సవరించిన పరీక్షా టైం టేబుల్, ఇతర వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్లో చూడవచ్చన్నారు.

News April 23, 2025

HYDలో నేడు ఎన్నికలు.. BJP VS MIM

image

GHMC హెడ్ ఆఫీస్‌లో నేడు స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. MIM నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్, BJP నుంచి గౌతంరావు బరిలో ఉన్నారు. 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియోలతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. MIMకు 50 ఓట్లు, BRSకు 24, BJPకి 24, INCకు 14 ఓట్లు ఉన్నాయి. 22 ఏళ్ల తర్వాత ఈ ఎన్నిక జరగడం, INC, BRS పోటీ చేయకపోవడంతో గ్రేటర్ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. APR 25న లెక్కింపు జరగనుంది.

error: Content is protected !!