News February 18, 2025
పెద్దపల్లి: ‘మరమ్మతు పనులు వెంటనే ప్రారంభించాలి’

నిర్దేశిత పనులను మండలాల్లో ప్రతి అధికారి సమర్థంగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తనిఖీ తర్వాత జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్.సీ.డీ సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 26, 2025
దుక్కి సమస్య నేలల్లో బాగా మొలక రావాలంటే?

మాగాణిలో వరి తర్వాత ఆరుతడి పంటలకు అనువుగా దుక్కి చేయడం ఒక ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇక్కడ వరి తర్వాత ఆరుతడి పంటలు వేయడానికి భూమిని దున్నగానే పెళ్లలు పెద్దవిగా లేస్తాయి. అందువల్ల వేసిన పంట సరిగా మొలకెత్తదు. ఇలాంటి సమస్య ఉన్న భూముల్లో మొదట మాములుగా నాగళ్లతో దున్నిన తర్వాత ట్రాక్టరుతో నడిచే రోటవేటర్ (లేదా) పళ్లదంతెతో దున్నితే పెద్ద పెళ్లలు పగిలి అనువైన దుక్కి వస్తుంది.
News October 26, 2025
NZB: గ్యాలంటరీ అవార్డు ఎవరికి ఇస్తారో తెలుసా?

దేశ రక్షణలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి గ్యాలంటరీ అవార్డులు ఇస్తారు. NZBలో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన నేరస్థుడు రియాజ్ను పట్టించిన ఆసిఫ్ను గ్యాలంటరీ అవార్డుకు సిఫార్సు చేస్తామని ఇటీవల డీజీపీ శివధర్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ప్రధానంగా 6 రకాల గ్యాలంటరీ అవార్డులు ఉంటాయి. పరమ వీర చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, అశోక్ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర అవార్డులను ప్రదానం చేస్తారు.
News October 26, 2025
రాష్ట్రంలో 225 పోస్టులు.. అప్లై చేశారా?

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(TGCAB) 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష , సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.750, SC/ST/PWBDలకు రూ.250. వెబ్సైట్:
https://tgcab.bank.in


