News November 13, 2024

పెద్దపల్లి: మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఢిల్లీ ఎక్స్ప్రెస్ రైలు

image

పెద్దపెల్లి జిల్లా రాఘవపూర్ కన్నాల మధ్యలో గూడ్స్ రైలు పట్టాలు తప్పి పడిపోవడంతో 24 గంటల పాటు ఎక్కడికి అక్కడ రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు 24 గంటలు శ్రమించి రైల్వే లైన్ క్లియర్ చేశారు. రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వహించి రాకపోకలకు అనుమతి ఇచ్చారు. దీంతో ఢిల్లీ వైపు వెళ్లే రైళ్లు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. మరో రెండు గంటల్లో డౌన్ లైన్‌లో ట్రైలర్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News December 9, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ గంభీరావుపేట మండలంలో ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.
@ రాయికల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జగిత్యాల డిఎస్పీ.
@ కరీంనగర్ ప్రజావాణిలో 208 ఫిర్యాదులు.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ మెట్పల్లి మండలం ఆరపేటలో వైభవంగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు తాజా మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్.

News December 9, 2024

KNR: ప్రజావాణికి 208 దరఖాస్తులు

image

కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. 208 మంది అర్జీదారులు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు. అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి అర్జీదారుల నుంచి దరఖాస్తుల స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

News December 9, 2024

వేములవాడ మాజీ MLA రమేశ్‌కు హైకోర్టు షాక్

image

VMWD మాజీ MLA రమేశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పౌరసత్వంపై రమేశ్ పిటీషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసు విషయమై 15.5 ఏళ్ల పాటు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించడంతో హైకోర్టు రమేశ్‌కు రూ.30 లక్షల జరిమానా విధించింది. ఇందులో ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, రూ.5 లక్షలు నెలరోజుల్లో కోర్టుకు చెల్లించాలని ఆదేశించింది.