News February 14, 2025
పెద్దపల్లి: మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో బాలల సంరక్షణ చర్యలపై సంబంధిత మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. బాలల సమస్యలపై ఫిర్యాదులు అందించేందుకు 1098 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. అనాథ పిల్లలు, సెమీ ఆర్ఫన్ పిల్లలో స్పాన్సర్షిప్కు అర్హులైన పిల్లలను గుర్తించి వారి వివరాలు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు.
Similar News
News July 6, 2025
బిక్కనూర్: TU సౌత్ క్యాంపస్‌ను సందర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్

బిక్కనూరు మండల పరిధిలోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌ను ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
శనివారం సందర్శించారు. క్యాంపస్‌లోని వసతి గృహాలను పరిశీలించారు. అక్కడ విద్యార్థులు పొందుతున్న మౌలిక సదుపాయాలు, వసతి సౌకర్యాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
News July 6, 2025
ప్రపంచంలో ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్న YouTube ఛానళ్లు ఇవే..

1.MrBeast (అమెరికా)- 411 మిలియన్లు
2.T-Series (ఇండియా)- 298 మి.
3.Cocomelon – Nursery Rhymes (అమెరికా)- 195 మి.
4.SET India (భారత్)- 185.1 మి.
5.Vlad and Niki (అమెరికా)- 142 మి.
6.Kids Diana Show (అమెరికా)- 135 మి.
7.Like Nastya (అమెరికా)- 128 మిలియన్లు
8.Stokes Twins (అమెరికా)- 128 మి.
9.Zee Music Company (భారత్)- 114 మి.
10.PewDiePie (జపాన్/స్వీడన్)- 111 మి.
News July 6, 2025
వికారాబాద్ జిల్లాలో కొత్తగా 8993 మంది

వికారాబాద్ జిల్లాలో గత నెలలో నిర్వహించిన బడిబాట సత్ఫలితాలు ఇవ్వడంతో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 1925 ఎక్కువగా అడ్మిషన్లు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరానికి 8993 అడ్మిషన్లు వచ్చినట్లు జిల్లా విద్యాధికారి రేణుకా దేవి తెలిపారు. గత సంవత్సరంలో 7,078 అడ్మిషన్లు వచ్చాయి. అయితే గవర్నమెంట్ టీచర్లు చేపట్టిన బడిబాటతో మంచి స్పందన వచ్చింది. సర్కారు కల్పించే సౌకర్యాలూ వివరిస్తూ వచ్చారు.