News March 12, 2025

పెద్దపల్లి: మీకోసం TGNPDCL మొబైల్ ఫోన్ యాప్: ఎస్ఈ

image

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి TGNPDCL మొబైల్ ఫోన్ యాప్‌ను రూపొందించిందని పెద్దపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ మాధవరావు పేర్కొన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం 20 ఫీచర్లతో కూడిన TGNPDCL డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 18004250028, 1912ని సంప్రదించాలని సూచించారు.

Similar News

News March 13, 2025

గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ

image

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్‌లో ఉన్న వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో గురువారం మరోసారి విచారణ జరగనుంది. గతంలో వంశీకి బెయిల్ నిరాకరించగా, తాజా పిటిషన్‌పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఈ 71గా వంశీ ఉన్నారు. ఇటీవల నియోజకవర్గంలో పలు కేసులు ఆయనపై నమోదయ్యాయి.

News March 13, 2025

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 

image

KNR జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా బురుగుపల్లి 39.9°C నమోదు కాగా, కొత్తపల్లి-ధర్మారం, వెంకేపల్లి 39.8, జమ్మికుంట 39.7, గంగాధర 39.6, ఖాసీంపేట 39.5, ఇందుర్తి, ఈదులగట్టేపల్లి 39.2, వీణవంక 39.0, నుస్తులాపూర్ 38.9, బోర్నపల్లి, తాంగుల 38.7, అర్నకొండ, గుండి 38.5, గంగిపల్లి 38.3, పోచంపల్లి 38.2, మల్యాల 38.0, దుర్శేడ్ 37.9, చింతకుంట 37.7, KNR 37.6°Cగా నమోదైంది.

News March 13, 2025

ఉష్ణోగ్రతల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి: గంగాధర్

image

జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఎండలో పనిచేసే వారు వడదెబ్బకు గురికాకుండా తగిన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ గంగాధర్ అధికారులను ఆదేశించారు. భువనగిరిలో ఆరోగ్యశాఖ అధ్వర్యంలో ముద్రించిన పోస్టర్ అవిష్కరించి మాట్లాడారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు, నేరుగా సూర్యకిరణాలు తాకే స్థలాల్లో పనిచేసే వారు వడదెబ్బకు గురికాకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

error: Content is protected !!