News November 13, 2024
పెద్దపల్లి: ముమ్మరంగా కొనసాగుతున్న రైల్వే ట్రాక్ పనులు
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు బోగీలు తొలగించడంతో పాటు ట్రాక్‌పై మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పెద్దపెల్లి జిల్లా రాఘవపూర్ కన్నాల మధ్యలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు భారీ జేసీబీలు తెప్పించే మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఇప్పటివరకు మెయిన్ లైన్ రైల్వే ట్రాక్ 600 మీటర్ల వరకు పైగా పూర్తిగా తొలగించినట్లు సమాచారం.
Similar News
News December 7, 2024
కాళేశ్వరం: మే 15 నుంచి సరస్వతీ పుష్కరాలు
వచ్చే సంవత్సరం మే నెలలో కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతీ పుష్కరాల నిర్వహణకు అధికారులు అంచనాలు, నివేదికలు అందజేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సరస్వతీ పుష్కరాల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
News December 7, 2024
రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. కరీంనగర్ REPORT
రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా, ఈ ఏడాదిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి జిల్లాకు రూ.1,000 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పున:ప్రారంభం, ఉమ్మడి జిల్లా రోడ్ల విస్తరణకు రూ.100 కోట్లు, వేములవాడ ఆలయానికి రూ.127 కోట్లు ఇంకా మరెన్నో నిధులు తెచ్చామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వచ్చే 4 ఏళ్లలో మరింత అభివృద్ధి చేస్తామని అంటున్నారు. దీనిపై మీ కామెంట్?
News December 7, 2024
పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇటీవల కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ మేరకు డెయిరీ బ్రాండ్ ‘డైరీ ట్రెండ్స్’ లోగోను ఆవిష్కరించి మాట్లాడారు. MSMEలను స్థాపించడానికి తెలంగాణ అద్భుతమైన వ్యాపార వాతావరణాన్ని కల్పిస్తోందని, పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.