News February 14, 2025
పెద్దపల్లి: ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తానని, వారికి ఇచ్చిన మాట ప్రకారం భూమి కేటాయించామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం పెద్దపల్లి పట్టణంలో ఫారన్ మసీదులో ముస్లింలు నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాఘవపూర్ గ్రామ శివారులో ఇచ్చిన మాట ప్రకారం కబ్రస్థాన్ నిర్మాణానికి రెండు ఎకరాల భూమి కేటాయించామని తెలిపారు.
Similar News
News March 21, 2025
వారి నవ్వు చూసి నాకు సంతోషం కలిగింది: నాగబాబు

AP: శాసనసభ కల్చరల్ ఈవెంట్‌లో CM చంద్రబాబు, Dy.CM పవన్ నవ్వడం చూసి తనకు సంతోషం వేసిందని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. ‘ఆ రోజు అసెంబ్లీలో గౌరవనీయులైన చంద్రబాబుకు జరిగిన అవమానానికి ఆయన కన్నీరు పెట్టడం ఎంతో బాధించింది. ఇప్పుడు ప్రజాప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా నవ్వుతున్న దృశ్యం ఆహ్లాదంగా అనిపించింది. పని ఒత్తిడిలో పవన్ కూడా నవ్వడం చూసి సంతోషం వేసింది’ అని ట్వీట్ చేశారు.
News March 21, 2025
పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ హనుమంతరావు

జిల్లాలో 10వ తరగతి ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ హనుమంతరావు భువనగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్షకేంద్రాన్ని సందర్శించారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పరీక్షలు మంచిగా రాయాలన్నారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. అన్ని గదులను కలియ తిరిగి.. ఎలక్ట్రిసిటీ, తాగునీరు తదితర మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణ పైన చీఫ్ సూపరింటెండెంట్‌కు పలు సూచనలు చేశారు.
News March 21, 2025
పంట నీటి కుంటలు యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలి: కలెక్టర్

పంట నీటి కుంటలు యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. పల్లె పండుగ, పంట నీటి కుంటల నిర్మాణంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి పంట నీటి కుంటలు నిర్మించాలని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.