News April 14, 2025

పెద్దపల్లి: యువ వికాసం పథకానికి 34 వేల దరఖాస్తులు

image

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకానికి పెద్దపల్లి జిల్లాలో 34 వేల దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు సోమవారం తెలిపారు. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయంతో పాటు శిక్షణ కల్పించేందుకు రూపొందించిన ఈ పథకంపై యువతలో భారీ స్పందన కనిపిస్తోంది. ఇంకా దరఖాస్తు చేయని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News December 7, 2025

GWL: సైబర్ మోసంలో రూ.4.33 లక్షలు రికవరీ

image

మల్దకల్‌ మండలంలో నమోదైన సైబర్‌ మోసం కేసును గద్వాల సైబర్‌ వింగ్‌ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సైబర్‌ మోసానికి గురైన బాధితుడి నుంచి రూ.4.33 లక్షలు రికవరీ చేసి, అతని ఖాతాలో జమ చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు శనివారం తెలిపారు. రికవరీ చేసిన నగదు పత్రాలను బాధితుడికి అందజేసి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News December 7, 2025

కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్: స్టెయిన్

image

టీమ్ ఇండియాపై వన్డే సిరీస్ కోల్పోవడం కాస్త నిరుత్సాహ పరిచిందని SA మాజీ పేసర్ డేల్ స్టెయిన్ పేర్కొన్నారు. ‘ఇది ఒక బ్యాడ్ డే. సిరీస్ డిసైడర్‌లో తప్పులకు తావుండకూడదు. టీమ్ ఇండియాకి శుభాకాంక్షలు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ(65*) అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్. నేను 20-20 మ్యాచుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. IND-SA మధ్య 5 టీ20ల సిరీస్ డిసెంబర్ 9 నుంచి కటక్ వేదికగా ప్రారంభంకానుంది.

News December 7, 2025

యాడికి: నిద్ర మాత్రలు మింగి యువకుడి సూసైడ్

image

యాడికి మండలం నగురూరుకు చెందిన శరత్ కుమార్(23) నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకున్నాడు. గత నెలలో శరత్ కుమార్ బళ్లారిలో వివాహం చేసుకున్నాడు. బెంగళూరులో ప్రైవేట్ జాబ్‌లో జాయిన్ అయ్యాడు. శుక్రవారం నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో తన స్నేహితుని ఇంటికి వెళ్లాడు. అక్కడ నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అనంతపురం తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.