News January 23, 2025
పెద్దపల్లి- రంగాపూర్ ప్రధాన రహదారి వద్ద చెట్టును ఢీకొట్టిన కారు

పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ గ్రామం వద్ద ప్రధాన రహదారికి అనుకుని ఉన్న చెట్టును కారు ఢీ కొట్టింది. అయితే ప్రమాదం ఎప్పుడూ జరిగింది. అందులో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో తెలియలేదు. కారులో ఉన్న వ్యక్తులకు కాళ్లు విరిగినట్లు, తలకు గాయాలయయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 19, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ.6,810

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు సైతం పత్తి ధర అన్నదాతకు నిరాశే మిగిల్చింది. సోమవారం, మంగళవారం రూ.6,800 పలికిన క్వింటా పత్తి ధర.. ఈరోజు రూ.10 పెరిగి, రూ.6,810కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారాలు చెబుతున్నారు.
News February 19, 2025
సీబీఎస్ఈ కీలక నిర్ణయం

సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్స్ తరహాలో ఏడాదిలో రెండు సార్లు పరీక్ష నిర్వహణను వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ నెల 24న ముసాయిదాను విడుదల చేయనుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. దీంతో విద్యార్థులు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉందని తెలిపింది.
News February 19, 2025
వరంగల్: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాలు.. వరంగల్ నగరం కరీమాబాద్‌కు చెందిన రాజేశ్(24) కొంతకాలంగా HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడి స్నేహితుడి పెళ్లి కోసం ఇంటికి వచ్చాడు.ఆదివారం ఉదయం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని కన్పించాడు. మెడపై గాయాలున్నాయనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.