News March 22, 2025
పెద్దపల్లి: రేపట్నుంచి ఏప్రిల్ 5 వరకు ప్రత్యేక డ్రైవ్

మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అదనపు కలెక్టర్ డి.వేణు, ఆర్డీవోలు, సంబంధిత తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూముల సంరక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
Similar News
News December 5, 2025
కోదాడ: భర్త వార్డు సభ్యుడిగా.. భార్య సర్పంచ్గా పోటీ..!

కోదాడ పరిధి అనంతగిరి మండలం అమినాబాద్లో భార్యాభర్తలు ఇద్దరూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. భర్త చిలకమూడి శ్రీనివాసరావు వార్డు సభ్యుడిగా పోటీలో ఉండగా సర్పంచ్ స్థానం మహిళకు రిజర్వ్డ్ కావడంతో ఆయన భార్య సంధ్యారాణిని బరిలో నిలిపారు. కాగా వారికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతోంది. శ్రీనివాసరావు గతంలో పీఏసీఎస్ వైస్ ఛైర్మన్గా పనిచేశారు. దంపతులు ఇరువురు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
News December 5, 2025
కేఎల్యూలో నేడు ‘ఉద్భవ్-2025’ ముగింపు సంబరాలు

వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్న 6వ జాతీయ ఏకలవ్య సాంస్కృతిక ఉత్సవాలు ‘ఉద్భవ్-2025’ నేటితో ముగియనున్నాయి. గిరిజన సంక్షేమ గురుకులాల ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు ముగింపు వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేశ్, డోలా బాలవీరాంజనేయస్వామి, గుమ్మడి సంధ్యారాణి అతిథులుగా హాజరవుతారు. గిరిజన విద్యార్థుల కళా ప్రదర్శనల అనంతరం, చేతులకు బహుమతులు అందించనున్నారు.
News December 5, 2025
నల్గొండ: ఏపీ సీఎంను కలువనున్న మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలవనున్నారు. అమరావతి, క్యాంపు కార్యాలయంలో బాబును కలిసి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8, 9వ తేదీల్లో నిర్వహించ తలపెట్టిన రైసింగ్ తెలంగాణ-విజన్ 2047, గ్లోబల్ సమ్మిట్కు హాజరుకావాలని ఆహ్వానించనున్నారు.


