News February 23, 2025
పెద్దపల్లి: రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు

పెద్దపల్లి కలెక్టరేట్లో ఫిబ్రవరి 24న సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 27న నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా అధికారులు అందరూ ఎన్నికల విధుల్లో క్షేత్రస్థాయిలో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News February 23, 2026
నాగర్‌కర్నూల్: 3 రోజులు కొట్టుమిట్టాడిన పసి ప్రాణం..!

FEB 18- కుమ్మెర జాతరలో దాడి, PSలో బాధితుల ఫిర్యాదు
FEB 21- 3రోజుల తర్వాత చికిత్స పొందుతూ చిన్నారి మృతి, మళ్లీ PSకు వచ్చిన బాధితులు
FEB 21- పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుల ఆరోపణ
FEB 21- వార్త తెలిసి ఆగ్రహించిన ధర్మ సమాజ్ నేతలు NGKLఆస్పత్రి ఎదుట ధర్నా
FEB 21- నిందితులపై కేసు నమోదు చేస్తామని DSP హామీ
FEB 22- బాధితులకు మద్దతిస్తూ BRS, TRP, బీసీ సంఘాల నేతల ధర్నా
FEB 22- ముగ్గురు నిందితుల అరెస్ట్
News February 23, 2026
నీటి వసతి లేకుంటే పామాయిల్ సాగు వద్దు

ఆయిల్ పామ్ సాగును ఎలాంటి నేలల్లో చేపట్టినా నీటి వసతి ముఖ్యం. వర్షాధారంగా ఈ పంట సాగును చేపట్టలేము. అందుకే ఏ రైతైనా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పంట సాగు కోసం మొక్కకు రోజుకు 150 నుంచి 250 లీటర్ల నీరు అవసరం అవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా నీరు అందించి మంచి దిగుబడులను పొందవచ్చు.
News February 23, 2026
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<


