News February 10, 2025

పెద్దపల్లి: రేపు ముసాయిదా జాబితా విడుదల

image

పెద్దపల్లి జిల్లాలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమయతమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడంతో అధికారులు ఆ దశగా అడుగులు వేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో 2019 ఎన్నికల ప్రకారం జడ్పీటీసీలు 13, ఎంపీటీసీ 137 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త మున్సిపాలిటీలను కలుపుకుంటే కొంత తగ్గే అవకాశం ఉంది. అటు ఎన్నికల కమిషన్ ఆదేశాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.

Similar News

News October 17, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా రహదారుల భద్రత సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజెండా అంశాలపై సమీక్షించిన కలెక్టర్, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News October 17, 2025

రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

image

TG: రేపు బంద్ పేరిట అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని DGP శివధర్ రెడ్డి హెచ్చరించారు. పోలీసులు, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయన్నారు. బంద్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా రేపు రాష్ట్రవ్యాప్తంగా BC సంఘాల నేతలు బంద్ చేపట్టనున్నారు. దీనికి INC, BRS, BJP, CPI, CPM సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.

News October 17, 2025

ఒకే స్కూల్‌లో అక్క–తమ్ముడు టీచర్లు!

image

నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన బాల స్వామి–నాగమణి దంపతుల కుమార్తె సారా పింకీ, కుమారుడు శామ్యూల్‌ మెగా డీఎస్సీ-2025లో టీచర్లుగా ఎంపికయ్యారు. వీరిద్దరికీ తుగ్గలి మండల హుసేనాపురం ఉర్దూ పాఠశాలలోనే పోస్టింగ్ రావడం విశేషం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ స్థాయికి చేరుకున్నామని, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.