News February 10, 2025

పెద్దపల్లి: రేపు ముసాయిదా జాబితా విడుదల

image

పెద్దపల్లి జిల్లాలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమయతమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడంతో అధికారులు ఆ దశగా అడుగులు వేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో 2019 ఎన్నికల ప్రకారం జడ్పీటీసీలు 13, ఎంపీటీసీ 137 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త మున్సిపాలిటీలను కలుపుకుంటే కొంత తగ్గే అవకాశం ఉంది. అటు ఎన్నికల కమిషన్ ఆదేశాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.

Similar News

News March 11, 2026

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> స్టేషన్ ఘనపూర్: కారు బైక్ ఢీ ఇద్దరికీ తీవ్ర గాయాలు
> జనగామ: సర్వికల్ క్యాన్సర్ నివారణకు హెచ్పివి టీకా
> జనగామ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సులు
> ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
> వంట గ్యాస్ ధరలను తగ్గించాలని జిల్లా వ్యాప్తంగా నిరసన
> పాలకుర్తి: వీధి కుక్కల దాడిలో 13 గొర్రెల మృతి
> మల్లికార్జున ఖర్గేను కలిసిన వరంగల్ ఎంపీ కావ్య

News March 11, 2026

కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్

image

కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించి భోజనం రుచికరంగా వండాలని వంట సిబ్బందిని జిల్లా కలెక్టర్ హైమవతి ఆదేశించారు. నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి రాత్రి భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, దోసకాయ కూర, సాంబారు, పెరుగును పరిశీలించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని ఆదేశించారు.

News March 10, 2026

గ్యాస్ కొరత‌.. మొబైల్, ఇంటర్నెట్‌పై ఎఫెక్ట్?

image

LPG కొరతతో మొబైల్, ఇంటర్నెట్ సేవలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. టెలికాం టవర్ తయారీ సంస్థలకు గ్యాస్ సప్లై నిలిచిపోవడమే ఇందుకు కారణం. టెలికం టవర్లు తుప్పుపట్టకుండా తయారీ సమయంలో జింక్‌తో వేసే రక్షణ పొరకు LPG/LNG అవసరం. ఈ గాల్వనైజేషన్ ప్రాసెస్‌కు తగిన LPG లేకపోతే ఆపరేషన్స్ నిలిపివేయాల్సి వస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీంతో నెట్‌వర్క్ విస్తరణ నెమ్మదించి కనెక్టివిటీపై ప్రభావం పడుతుందని తెలిపారు.