News January 24, 2025
పెద్దపల్లి: ‘రైతులకు విజ్ఞప్తి ‘

పెద్దపల్లి జిల్లాలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా యాసంగి పెట్టుబడి సాయం అందించనుంది. ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో ఆయా గ్రామాల రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జనవరి 1లోపు పట్టాదారుగా నమోదైన రైతులు బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, PPBతో ఆయా గ్రామాల రైతు వేదికల్లో AEOలకు దరఖాస్తులు అందజేయాలి. రైతు బంధు పొందిన వారు, గ్రామసభల్లో దరఖాస్తు చేసినవారు మళ్లీ సమర్పించాల్సి పనిలేదన్నారు.
Similar News
News February 13, 2025
PMAY ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన

AP: PMAY 1.0ను కేంద్రం 2027 వరకు పొడిగించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. PMAY 2.0 సర్వే కొనసాగుతోందని, ఇప్పటివరకు 11,600 మంది లబ్ధిదారులను గుర్తించామని వెల్లడించారు. గతంలో TDP హయాంలో 3.18L మందిని ఎంపిక చేయగా, YCP ఆ జాబితాను మార్చేసి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిందన్నారు. అప్పుడు మిగిలిపోయిన వారికి 2024 ఏప్రిల్ తర్వాత ఇళ్లు మంజూరయ్యాయని, మరో 4.5L ఇళ్లను కేటాయించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
News February 13, 2025
తెలుగు రాష్ట్రాలను మద్యం మాఫియా నడిపిస్తోంది: శ్రీనివాస్ గౌడ్

కాంగ్రెస్ ప్రభుత్వం బీరుకు రూ.30 నుంచి రూ.40 వరకు ధర పెంచిందని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. BRS హయాంలో నామమాత్రపు ధర పెంచితే గగ్గోలు పెట్టారన్నారు. బీర్ల ధరలు పెంచడం దేనికి సంకేతం.. నాణ్యతలేని బీర్లు తీసుకువస్తున్నారని తెలిపారు. AP, TGలో ఒకేసారి ధరలు పెంచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను మద్యం మాఫియా నడిపిస్తోందని ఆరోపించారు.
News February 13, 2025
RCB కెప్టెన్‌గా రజత్ పాటిదార్?

IPL-2025 సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇవాళ తమ కెప్టెన్‌ను ప్రకటించనుంది. రజత్ పాటిదార్‌ను కెప్టెన్‌గా ఖరారు చేసినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాటిదార్ కెప్టెన్‌గా మెప్పించారు. మధ్యప్రదేశ్ జట్టును ఫైనల్‌కు చేర్చారు. 2021 నుంచి RCBకి ఆడుతున్నారు. కాగా కోహ్లీ తిరిగి RCB కెప్టెన్సీ బాధ్యతలు చేపడతారని గత కొంతకాలంగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.