News July 11, 2024
పెద్దపల్లి: రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఓదెల గ్రామానికి చెందిన రామినేని శంకరయ్య(68) పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో 1వ ప్లాట్ ఫారం నుంచి 2వ నంబర్ ప్లాట్ ఫారం వైపు రైల్వే ట్రాక్ పైనుంచి దాటుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టండతో అతడు మృతి చెందినట్టు పేర్కొన్నారు.
Similar News
News February 26, 2026
కరీంనగర్ బస్టాండ్‌లో లగేజీ బ్యాగు లభ్యం

కరీంనగర్ బస్టాండ్ పోలీస్ అవుట్‌పోస్ట్ పరిధిలో పది రోజుల క్రితం ఒక సూట్‌కేసు లభ్యమైంది. అందులో విలువైన దుస్తులు, పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆధార్ కార్డు ఉన్నాయి. కార్డులోని ఫోన్ నంబర్‌కు పోలీసులు ప్రయత్నించగా సిగ్నల్ అందడం లేదు. బాధితులు 9440469543, 8712580332 నంబర్లలో సంప్రదించి, ఆధారాలు చూపి బ్యాగును తీసుకెళ్లాలని అవుట్‌పోస్ట్ పోలీసులు కోరారు.
News February 26, 2026
కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్ర మిశ్రా

కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న పమేలా సత్పతిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం, కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్ర మిశ్రాను నియమించారు. ప్రస్తుతం ఆమె ITDA ఏటూరునాగారంలో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నూతన కలెక్టర్ చిత్ర మిశ్రా రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.
News February 25, 2026
KNR: ‘మహిళల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి’

అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత కేంద్రం ద్వారా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిర్మూలన చట్టం – 2013 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో లోకల్ కమిటీ మెంబర్ రాజా రెడ్డి ఈ చట్టంపై అవగాహన కల్పించారు. పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం ఈ చట్టం ఎంత ముఖ్యమో వివరించారు.


