News February 12, 2025
పెద్దపల్లి: వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739278072378_51751241-normal-WIFI.webp)
న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేయడానికి అభ్యంతరం లేదని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసును CBIకి అప్పగించేందుకు ప్రభుత్వానికి కూడా అభ్యంతరం లేదని ఇప్పటికే తేల్చి చెప్పింది. తమపై లేని ఆరోపణలు చేసి నిందితులుగా చేర్చారని పుట్ట మధు తరఫు న్యాయవాది కేసు కొట్టివేయాలని కోర్టును కోరారు. కోర్టు కేసును 2 వారాలకు వాయిదా వేసింది.
Similar News
News February 12, 2025
2కె రన్ ప్రారంభించిన వరంగల్ సీపీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739337055828_18102126-normal-WIFI.webp)
‘SAY NO TO DRUGS,’ డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రం అనే నినాదంతో వరంగల్ నగరంలో ఈరోజు తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్(TSJU) ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. పోచంమైదాన్ కూడలి నుంచి కేఎంసీ వరకు జరుగుతున్న ఈ రన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, వరంగల్ జిల్లా ఉన్నతాధికారులు, వైద్యులు, యువత పాల్గొన్నారు.
News February 12, 2025
మార్కెట్లోకి BE6, XEV9 కార్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739339167134_727-normal-WIFI.webp)
అనంతపురం MGB మొబైల్స్ మహీంద్రా బ్రాంచ్ ప్రతినిధులు BEV BE6, XEV9E మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేశారు. మహీంద్రా AI ఆర్కిటెక్చర్, 110 cm వైడ్ సినిమా స్కోప్ లగ్జరీ డిస్ప్లేతో పాటు Z క్లాస్ సెక్యూరిటీతో 5 కెమెరాలను కలిగి ఉంది. ఆటో పార్కింగ్ సదుపాయం కూడా ఉండగా దీని ధర రూ.18.9 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని అన్నారు. ఏపీలో దీనిపై లైఫ్ టాక్స్ లేదు.
News February 12, 2025
MBNR: రెండు రోజులకు శవమై తేలింది!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739338760691_1292-normal-WIFI.webp)
ఇంట్లో గొడవపడి బయటికెళ్లిపోయిన మహిళ శవమై తేలిన ఘటన గండీడ్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. పగిడ్యాల్కి చెందిన పద్మమ్మ(38) ఆదివారం ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు అలిగి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంతవెతికినా ఆమె జాడ కనిపించలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత పగిడ్యాల్ మల్లమ్మచెరువులో శవమై తేలింది. పద్మమ్మకు భర్త, ముగ్గరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదైంది.