News February 12, 2025

పెద్దపల్లి: వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

image

న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేయడానికి అభ్యంతరం లేదని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసును CBIకి అప్పగించేందుకు ప్రభుత్వానికి కూడా అభ్యంతరం లేదని ఇప్పటికే తేల్చి చెప్పింది. తమపై లేని ఆరోపణలు చేసి నిందితులుగా చేర్చారని పుట్ట మధు తరఫు న్యాయవాది కేసు కొట్టివేయాలని కోర్టును కోరారు. కోర్టు కేసును 2 వారాలకు వాయిదా వేసింది.

Similar News

News March 17, 2025

కృష్ణా జిల్లాలో పది పరీక్షలకు సర్వం సిద్ధం 

image

నేటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లను విద్యాశాఖాధికారులు పూర్తిచేశారు. జిల్లాలో మొత్తం 145 కేంద్రాల్లో పరీక్షలు జరగనుండగా 22,341 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పరీక్షా కేంద్రాల్లో చేపట్టారు. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా 52 సిట్టింగ్, 05 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు. 

News March 17, 2025

తిరుపతి జిల్లాలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

తిరుపతి జిల్లాలో పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇందుకోసం పది మొబైల్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులు పరీక్షలను ప్రశాంతంగా రాయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాలు మూసివేస్తున్నట్లు తెలిపారు.

News March 17, 2025

నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. వీటిని గమనించండి 

image

తిరుపతి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం అయ్యే టెన్త్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విద్యార్థులు హాల్ టికెట్‌ చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. 164 మంది చీఫ్‌లు, 1,574 ఇన్విజిలేటర్లు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 30 సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బందిని పరీక్షల కోసం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

error: Content is protected !!