News February 7, 2025
పెద్దపల్లి: వారం రోజుల్లో బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాలి: అదనపు కలెక్టర్

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సంబంధించి ధాన్యం కేటాయింపులకు బ్యాంకు గ్యారంటీ లను వారం రోజులలో సమర్పించాలని అదనపు కలెక్టర్ డి.వేణు రైస్ మిల్లర్లను ఆదేశించారు.2024-25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సంబంధించి ధాన్యం కేటాయింపు కోసం 125 మంది రైస్ మిల్లర్లలో 15 మంది మాత్రమే బ్యాంకు గ్యారంటీలు సమర్పించారన్నారు. మిగిలిన రైస్ మిల్లర్లు వారం రోజులు బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News March 9, 2026
ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షకు.. 527 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 9,232 మంది విద్యార్థులకు గాను 8,705 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 399 మంది, ఒకేషనల్ విభాగంలో 128 మంది కలిపి మొత్తం 527 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
News March 9, 2026
ASF: ఓటింగ్ యంత్రాల భద్రతకు పటిష్ట చర్యలు: కలెక్టర్

ASF జిల్లా కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరచిన గోదాం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హరిత తెలిపారు. సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాంను పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాం వద్ద 24 గంటల పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాల పర్యవేక్షణ నిర్వహిస్తున్నామన్నారు.
News March 9, 2026
ASF: జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ASF జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించిన వివరాలు.. కౌతాల, కెరమెరి ప్రాంతాల్లో అత్యధికంగా 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్‌లో 38.1, బేజూర్‌లో 37.9 డిగ్రీలు నమోదయ్యాయి. కాగజ్‌నగర్‌లో 36.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.


