News April 5, 2025
పెద్దపల్లి వాసులూ.. అప్లై చేశారా..?

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్లైన్లో అప్లై చేసి హార్డ్ కాపీలను పెద్దపల్లి జిల్లాలోని MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE
Similar News
News November 15, 2025
ప్రణాళిక ప్రకారం నిర్వహించాలి: MHBD కలెక్టర్

ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని, ప్రత్యేక అధికారులు క్రమం తప్పకుండా కేంద్రాలను, వసతి గృహాలను పరిశీలించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. జిల్లా ప్రణాళిక, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై కలెక్టర్ శుక్రవారం వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News November 15, 2025
కామారెడ్డి: ఆన్లైన్ టాస్క్‌ల పేరుతో రూ.2.74 లక్షల టోకరా

టెలిగ్రామ్‌లో వచ్చిన లింకును ఓపెన్ చేసి దోమకొండకు చెందిన వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యారు. ‘గుబిభో’ అనే యాప్‌లో టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని నమ్మించారు. కొన్ని టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు క్రెడిట్ అయినట్లు స్క్రీన్ షాట్లు చూపించారు. డబ్బు ఖాతాలోకి బదిలీ చేసుకోవాలంటే కొంత మొత్తం చెల్లించాలని సూచించారు. దీంతో బాధితుడు రూ.2.74 లక్షలు పంపించాడు. మోసపోయానని గ్రహించి PSను ఆశ్రయించాడు.
News November 15, 2025
పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లాలో పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులతో ఆమె సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల అధ్యయన పద్ధతులు, బోధనా ప్రమాణాల మెరుగుదలపై కలెక్టర్ మార్గదర్శకాలు ఇచ్చారు.


