News February 1, 2025
పెద్దపల్లి: విద్యా కమిషన్ ప్రజా అభిప్రాయ సేకరణ: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ఫిబ్రవరి 4న తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ రాష్ట్ర నూతన విద్య పాలసీ రూపకల్పన పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రాష్ట్ర విద్యా పాలసీ రూపకల్పన కోసం విద్యా కమిషన్‌కు బాధ్యతలు అప్పగించిందని, అభిప్రాయాలను విద్యా కమిషన్‌కు తెలియజేయాలని పేర్కొన్నారు.
Similar News
News December 16, 2025
HYD: భగత్‌సింగ్ వీలునామా.. విప్లవానికి అక్షరనామా

‘భగత్‌సింగ్ వీలునామా’ నవల స్వాతంత్ర్య సమరయోధుడి ఆలోచనా, త్యాగస్ఫూర్తిని గుండెను తాకేలా ఆవిష్కరిస్తుంది. విప్లవం ఆయుధాలతోనే కాదు, ఆలోచనలతోనూ సాగుతుందన్న సత్యాన్ని బలంగా చాటిందీ పుస్తకం. భగత్‌సింగ్ ఆశయాలు, సమాజ మార్పుపై ఆయన కలలు ప్రతి పుటలో ప్రతిధ్వనిస్తాయి. యువతను ఆలోచింపజేసే ఈ రచన, దేశభక్తికి కొత్త నిర్వచనం చెబుతుంది. పాఠకుడిని లోతైన ఆలోచనలోకి నెట్టే బాధ్యతాయుత రచన. అందరూ చదవాల్సిన నవల ఇది.
News December 16, 2025
నేడు, రేపు స్కూళ్లకు సెలవు

TG: రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటైన స్కూళ్లలో ఇవాళ, రేపు సెలవు ఉండనుంది. ఓటు వేసేందుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్నారు. కాగా మూడో(తుది) విడతలో 4,158 సర్పంచ్, 36,434 వార్డు స్థానాలకు 394 సర్పంచ్, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది.
News December 16, 2025
GNT: శాబర్ జెట్‌ను కూల్చిన ఆంధ్ర వీరుడు

1965 ఇండో-పాక్ యుద్ధంలో పాకిస్థాన్ శాబర్ జెట్‌ను కూల్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి తెనాలి సమీప నిజాంపట్నానికి చెందిన హవల్దార్ తాతా పోతురాజు. పాత ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌తో శత్రు విమానాన్ని ఛేదించి భారత సైన్యానికి స్ఫూర్తినిచ్చారు. ఈ వీరోచిత సేవలకు రాష్ట్రపతి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ‘వీరచక్ర’ పురస్కారం అందుకున్నారు. 18 ఏళ్లకే సైన్యంలో చేరిన పోతురాజు 1975లో స్వచ్ఛంద విరమణ చేశారు.


