News March 23, 2025
పెద్దపల్లి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో ఎలుపుగొంగ కొమురయ్యకు చెందిన ఇల్లు ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధం అయింది. చుట్టూ పక్కల వారు మంటలను గమనించి పెద్దపల్లి ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగా వచ్చి మాటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఇల్లు కట్టుకోవడానికి దాచిన రెండు లక్షల నగదు, 5తులాల బంగారం, బియ్యం, బట్టలు, సరుకులు పూర్తిగా కాలిపోయాయని బాధితులు రోదిస్తూ తెలిపారు.
Similar News
News July 6, 2025
పెద్దపల్లి: జిల్లా అధ్యక్షుడిగా ఏటూరి శ్రావణ్ కుమార్

తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏటూరి శ్రావణ్ కుమార్ ఆచార్యులు నియామకం అయ్యారు. పెద్దపల్లిలోని హనుమాన్ దేవాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరంబుదూరు శ్రీకాంత్ ఆచార్యులు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నిట్టూరి సతీష్ శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాండూరి దామోదరచార్యులు ఆయనకు నియామకపు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ ఆచార్యులును పలువురు అభినందించారు.
News July 6, 2025
టెస్టు చరిత్రలో తొలిసారి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ టెస్టులో తొలిసారిగా 1000+ రన్స్ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్సులో 587 చేసిన గిల్ సేన రెండో ఇన్నింగ్సులో 427 పరుగులు చేసింది. ఇప్పటివరకు 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులే భారత జట్టుకు అత్యధికం. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో గిల్ ద్విశతకం, శతకం బాదగా ఇతర ప్లేయర్లు ఒక్క సెంచరీ చేయకపోవడం గమనార్హం.
News July 6, 2025
కామారెడ్డి: పీర్లను సందర్శించిన షబ్బీర్ అలీ

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మొహరంలో భాగంగా శనివారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీలో పీర్ల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ సలహాదారు వెంట కాంగ్రెస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు ఉన్నారు. ఆయన మాట్లాడుతూ.. మొహరం అన్ని వర్గాల వారు జరుపుకోవడం అభినందనీయమన్నారు.