News February 6, 2025
పెద్దపల్లి: విషాదం.. కంటికి మోటార్ బోల్ట్ తగిలి వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738751158294_71685917-normal-WIFI.webp)
అంతర్గాం మండలం గోలివాడలోని కాళేశ్వర్వం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగమైన పార్వతి పంప్-హౌస్ వద్ద బుధవారం దుర్ఘటన చోటుచేసుకుంది. జమ్మికుంటకు చెందిన మెగా కంపెనీ కార్మికుడు గుండబోయిన సంపత్(25) తన విధులు నిర్వహిస్తుండగా, మోటార్ పంపు బోల్ట్ ఎగిరి కంటికి తగిలింది. దీంతో తీవ్రగాయాలపాలైన అతడిని గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మరణించాడు. మృతుడి స్వస్థలం వరంగల్‌లోని దామెర గ్రామం.
Similar News
News February 6, 2025
జైభీమ్ అనడం కాదు అంబేడ్కర్‌ను అవమానించిందే కాంగ్రెస్: మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738839833469_1199-normal-WIFI.webp)
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదని PM మోదీ అన్నారు. ఎన్నికల్లో ఆయన్ను ఓడించేందుకు అనేక కుట్రలు పన్నారని ఆరోపించారు. అందుకు ఏం చేయకూడదో అన్నీ చేశారని పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వకుండా అవమానించారని అన్నారు. ఇప్పుడు బలవంతంగా జైభీమ్ అంటున్నారని, బాబా సాహెబ్ ఐడియాలజీని మాత్రం ఎప్పుడూ పాటించలేదని పేర్కొన్నారు. చరిత్రలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ తప్పులే కనిపిస్తాయన్నారు.
News February 6, 2025
BREAKING: విద్యార్థులకు సూపర్ న్యూస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738833706506_893-normal-WIFI.webp)
AP: మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై సన్నబియ్యం అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’పై మంత్రివర్గం చర్చించగా.. మెనూలో తీసుకొచ్చిన మార్పులను మంత్రి లోకేశ్ వివరించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే ఆహారాలను మెనూలో పెట్టనున్నట్లు చెప్పారు. లోకేశ్ చేసిన సన్నబియ్యం ప్రతిపాదనకు మంత్రి నాదెండ్ల మనోహర్ సహా ఇతర మంత్రులు అంగీకారం తెలిపారు.
News February 6, 2025
ఈనెల 10న డీ వార్మింగ్ డే: కలెక్టర్ అంబేడ్కర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738836666978_52016869-normal-WIFI.webp)
విజయనగరం జిల్లాలో గుర్ల మండలంలో తప్ప జిల్లా అంతటా ఈ నెల 10న డీ వార్మింగ్ డే సందర్భంగా అల్బెండజోల్ మాత్రలను సరఫరా చేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష జరిపారు. గుర్ల మండలంలో బోదకాలుకు సంబంధించిన మాత్రలు వేస్తున్నందున నులిపురుగుల నివారణా మాత్రలు ప్రస్తుతం వేయడం లేదని తెలిపారు. 19 ఏళ్లలోపు ఉన్న వాళ్లంతా అల్పెండజోల్ మాత్రలు వేసుకోవాన్నారు.