News April 7, 2025
పెద్దపల్లి: వేసవి వచ్చేసింది.. జాగ్రత్త!

వేసవి వచ్చేసింది. దీంతో ఉక్కబోత పెరిగింది. అయితే సాధారణంగా గ్రామాలు, పట్టణాల్లో ఉక్కబోత కారణంగా బయట పడుకుంటుంటారు. అదే అదనుగా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగారు ఆభరణాలు, ఫోన్లు దొంగిలించే అవకాశముందని చెబుతున్నారు. సెలవుల్లో ఊర్లకు వెళ్తే ఇంటికి తాళాలు వేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, చిన్నారులను ఈతకు వెళ్లకుండా చూడాలని సూచిస్తున్నారు.
Similar News
News January 8, 2026
తుని: ఎక్స్ప్రెస్ రైలులో మంటలు

పూరి-తిరుపతి(17479) ఎక్స్ప్రెస్లో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. తుని–హంసవరం మధ్య రైలు ప్రయాణిస్తుండగా B-5 బోగీలోని విద్యుత్ ప్యానల్ బోర్డు వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న దుప్పట్లకు నిప్పు అంటుకోవడంతో అప్రమత్తమైన ప్రయాణికులు కాలిపోతున్న దుప్పట్లను బయటకు విసిరేయడంతో ముప్పు తప్పింది. అనంతరం రాజమహేంద్రవరం స్టేషన్లో రైలును నిలిపివేసి సాంకేతిక నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు.
News January 8, 2026
అర్ధవీడులో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్

సంక్రాంతి, రిపబ్లిక్ డే పురస్కరించుకుని ఈనెల 10న అర్ధవీడులో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ.25,000, రెండో బహుమతి రూ.15,000 మూడో బహుమతి రూ.8000లు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ టోర్నమెంట్లో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
News January 8, 2026
KU: డబుల్ పీజీ విద్యార్థులకు హాస్టల్ అడ్మిషన్లు రద్దు

డబుల్ పీజీ చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీ హాస్టల్స్ అడ్మిషన్లకు అర్హులు కాదని కేయూ హాస్టల్స్ డైరెక్టర్ ఎల్సీ రాజ్కుమార్ బుధవారం స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి హాస్టల్లో చేరిన విద్యార్థులు ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అడ్మిషన్ రద్దు చేసుకోవాలని సూచించారు. గడువు దాటితే హాస్టల్ అడ్మిషన్ రద్దుతో పాటు డిపాజిట్ మనీ తిరిగి చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.


